ఒకటి కాదు రెండు కాదు.. ట్విట్టర్ వేధికగా నటుడు, జనసేన నాయకుడు నాగబాబు వరుస ట్విట్స్ తో తెగ హల్ చల్ చేస్తున్నారు.  గత ఏడాది నుంచి ఉన్నట్టుండి వివాదాస్పద అంశాలను తెరపైకి తెస్తూ ట్విట్టర్ ద్వారా రకరకాల అంశాలపై స్పందిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. జనసేన పార్టీ నుంచి నర్సాపురం ఎంపీగా గతేడాది పోటీ చేసిన నాగబాబు అక్కడ ఓటమి చెందిన సంగతి తెలిసిందే.  ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్లీ నటనపై దృష్టి పెట్టారు. కాకపోతే గత ఏడాది నుంచి మాత్రం యూట్యూబ్, ట్విట్టర్ వేధికగా అంతా నా ఇష్టం అన్న దోరణిలో వెళ్తున్నారు.  మొన్న నాధూరాం గాడ్సే ఒక దేశ భక్తుడు అని అన్నారు.. నిన్న మంత్రి అవంతి శ్రీనివాసరావు పై కామెంట్స్ చేశారు. ఇది ఇప్పటికే రచ్చగా మారింది. 

 

తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఇండియన్ కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్, అంబేద్కర్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, లాల్ బహదూర్ , పీవీ నరసింహారావు, అబ్దుల్ కలాం, సావర్కార్, వాజ్‌పేయి లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది. ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనము మర్చిపోకూడదని ఒక ఆశ' అని నాగబాబు ట్వీట్ చేశారు.

 

దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు. భావితరాలకు కరెన్సీ నోట్లపై వారి ముఖ పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది' అని నాగబాబు అన్నారు. అయితే  గాంధీ గారు బతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు అన్నారు. తాజాగా ఈ ట్విట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: