సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన మహేశ్ బాబు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. బాల నటుడిగానే ప్రకంపనలు సృష్టించిన మహేశ్ హీరోగా వచ్చిన తర్వాత రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. కేవలం రికార్డుల పరంగానే కాకుండా నటనలో పరిణితి చూపించి ఎన్నో అవార్డులను కూడా సాధించాడు. తన అత్యుత్తమ నటనతో ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన తొలి సినిమా ‘నిజం’. ఈ సినిమా విడుదలై నేటితో 17ఏళ్లు పూర్తి చేసుకుంది. కథాబలం ఉన్న ఈ సినిమాలో మహేశ్ నటనకు విమర్శకుల ప్రశంసలు పొందింది.

IHG

 

తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2003 మే 23వ తేదీన విడుదలైంది. సినిమాలో కథానుసారం ఆ పాత్రలో మహేశ్ జీవించాలి. మహేశ్ ఈ సినిమాలో తన నటనలోని స్థాయిని ప్రదర్శించాడు. భర్తను కోల్పోయిన తల్లికి అండగా ఉంటూ తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకునే పాత్రలో మహేశ్ నటన అద్భుతమనే చెప్పాలి. ఈ సినిమాకు ముందు మహేశ్ చేసిన ఒక్కడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఆ సినిమాతో మహేశ్ స్టార్ హీరో అయిపోయాడు. మహేశ్ సినిమాపై అభిమానుల అంచనాలు మారిపోయాయి. ఒక్కడు యాక్షన్ మోడ్ నుంచి పూర్తి కథా బలమున్న నిజం సినిమా చేశాడు మహేశ్.

IHG

 

అనేక అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా మాత్రం వర్కౌట్ కాలేదు. ఇందుకు ఒక్కడు సక్సెస్ సగం కారణమని చెప్పాలి. తేజ రాసుకున్న కథ, స్క్రీన్ ప్లే పరంగా సినిమా మంచి సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫిలిం అని చెప్పాలి. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. తేజ స్వీయ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. సినిమా ఫెయిల్ అయినా మహేశ్ లోని నటన స్థాయి ప్రేక్షకులకు అర్ధమయ్యేలా చేసింది ‘నిజం’.

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: