మోహన్ బాబు... ఈ తరానికి పెద్దగా ఈయన నటన పరిచయం లేదు గాని ముందు తరానికి మాత్రం ఆయన ఒక సంచలనం. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు చాలా మంది హాల్ కి వెళ్ళిపోయే వారు. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు పనులు మానుకుని కూడా చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. ఇక ఆయన స్టార్ హీరో అయిన విధానం ముందు నుంచి ఆయన చేసిన సినిమాలు అన్నీ కూడా ఒక సంచలనమే. అగ్ర హీరోల సినిమాల్లో ఆయన విలన్ గా అలాగే కీలక పాత్రలు చేసారు. హీరోగా కూడా ఎవరు చేయని సినిమాలు చేసారు ఆయన. 

 

వరుసగా సినిమాలు చేస్తూ ఆయన ఎవరికి అందని ఎత్తులో ఉండే వారు. ఇక వివాదాలు కూడా ఆయనకు ఎక్కువగానే ఉంటూ ఉండేవి అని చెప్తూ ఉంటారు. ఆయనకు అందరి తో మంచి పరిచయాలు ఉన్నా కాస్త దూకుడు ఉన్న వ్యక్తిగా ఆయనకు పేరు ఉంది అని అంటారు టాలీవుడ్ జనాలు. ఇక ఆయన సొంత ఊరు విషయానికి వస్తే ఆయనది చిత్తూరు జిల్లా తిరుపతి వద్ద ఉన్న మోదుగుల పాలెం. అక్కడినుంచి ఆయన సినిమాల మీద ఉన్న ప్రేమ తో కొందరి సూచన తో చెన్నై వెళ్ళారు. అక్కడ కొన్ని కష్టాలు పడినా సరే ఎక్కడా కూడా భయపడకుండా ఆయన సినిమాలు చేసారు. 

 

ఇక ఆయన సొంత ఊరు ఇప్పటికి కూడా వెళ్తూ ఉంటారు. ఆయన కుమారులు ఆయన కుమార్తె ఇప్పటికి కూడా సొంత ఊరు వెళ్లి వారి బంధువులను పరామర్శిస్తూ ఉంటారు. వారి తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ వెళ్తూ ఉంటాడు అని అంటారు. ఇప్పుడు వాళ్ళు సినిమాల్లో బిజీ గా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: