మహానటి సావిత్రి... ఈ పేరు వింటేనే చాలా మందికి ఒక ఉత్సాహం వస్తుంది. ఇండియన్ మొదటి లేడీ సూపర్ స్టార్. ఆమె చేసిన సినిమాలు ఆమెకు వచ్చిన పేరు ఆమె సాధించిన విజయాలు ఏ స్టార్ హీరోకి కూడా రాలేదు అనే చెప్పవచ్చు. జీవితంలో ఆమె మొదటి రోజు నుంచి చివరి వరకు కూడా పడిన కష్టం ఎవరూ కూడా పడలేదు అనేది వాస్తవం. ఆమె సాధించిన విజయాలు చూసి ఆమె తో పాటు పైకి వచ్చిన ఎందరో హీరోయిన్ లు ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. ఇక టాలీవుడ్ లో అయినా తమిళం లో అయినా సరే ఆమె తర్వాతే ఎవరు అయినా. 

 

నటన అంటే హీరోయిన్ అంటే సావిత్రి గురించి చెప్పిన తర్వాతే ఎవరి గురించి అయినా చెప్తూ ఉంటారు అనేది వాస్తవం. ఆమె టాలీవుడ్ లో ఎవరికి అందని ఎత్తుకి ఎదిగినా సరే ఆమె సాధించిన విజయాల గురించి కొందరు అప్పట్లో తప్పుడు ప్రచారం చేసి ఆమెను బాగా ఇబ్బంది పెట్టారు అని అంటూ ఉంటారు. ఇక టాలీవుడ్ లో ఆమె గురించి చెప్పుకొని వారు ఎవరూ కూడా ఉండరు అనేది వాస్తవం. ఇది పక్కన పెడితే ఆమె సొంత ఊరు గుంటూరు జిల్లా చిర్రావూరు. తెనాలి వెళ్ళే దారిలో ఉంటుంది ఈ గ్రామం. 

 

ఆ గ్రామం నుంచి ఆమె సినిమాల కోసం నేరుగా చెన్నై వెళ్ళారు. చెన్నై లోనే ఆమె స్టార్ హీరోయిన్ అయ్యారు. అయినా సరే ఆమె అనేక సందర్భాల్లో గ్రామానికి వచ్చే వారు. తన కుటుంబాన్ని తన సొంత వారిని చూసుకోవడానికి ఆమె సొంత గ్రామం వచ్చారు. ఇక ఆమెకు అక్కడ ఇప్పటికి కూడా స్నేహితులు ఉన్నారు. ఆమె తో కలిసి చదువుకున్న వారు అక్కడే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: