టాలీవుడ్ లో ఒక సంచలనం సృష్టించిన నటుల్లో కృష్ణ ఒకరు. ఒక మారు మూల పల్లె నుంచి సూపర్ స్టార్ గా ఆయన పైకి వచ్చిన విధానం ఎందరికో ఆదర్శం అనేది వాస్తవం. ఎన్నో కష్టాలు పడి ఆయన పైకి వచ్చారు. ఆయన పడిన కస్టాలు అన్నీ ఇన్ని కావు. అయినా సరే తెలుగు సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుని ఆయన అలా నిలిచిపోయారు. అక్కినేని ఎన్టీఆర్ ని తట్టుకుని ఆయన ఆ రోజు సినిమాలను చేసి స్టార్ హీరో అయ్యారు. అక్కడి నుంచి సూపర్ స్టార్ గా నిలిచారు. ఆయన చేసిన ప్రయోగాలు ఆయన చేసిన సాహసాలు ఎవరూ కూడా చేయలేదు టాలీవుడ్ లో అని అంటూ ఉంటారు.

 

ఆయన ఎన్టీఆర్ మీదే ఒకానొక సందర్భంలో పోరాట౦ చేసారు అని అంటారు. వారి ఇద్దరికీ మధ్య విభేదాలు వచ్చాయని కాని ఆ తర్వాత పరిష్కరించుకున్నారు అని అంటారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఆ తరం వారిలో మిగిలింది కృష్ణ ఒక్కరే. ఇక ఆయన సినిమాలు అన్నీ కూడా ఒక సంచలనం అని చెప్తూ ఉంటారు ఆయన అభిమానులు. ఇక ఆయన గ్రామం విషయానికి వస్తే ఆయనది తెనాలి వద్ద ఉన్న బుర్రిపాలెం గ్రామం అక్కడి నుంచి బుర్రి పాలెం బుల్లోడిగా కృష్ణ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఇక ఆయన ఎంత సూపర్ స్టార్ అయినా సరేసొంత గ్రామాన్ని మాత్రం వదలి పెట్టలేదు. 

 

ఆయన జీవితంలో చిన్న తనం మొత్తం అక్కడ తెనాలి లో గడిచింది. ఇక అక్కడి నుంచి కూడా ఆయన నేరుగా చెన్నై వెళ్ళారు. చెన్నై లో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరో అయిపోయారు. ఇప్పుడు  కొడుకు మహేష్ బాబు తో కలిసి అయన  సొంత గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: