తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న వారిలో వి.వి.వినాయక్ ఒకరు. ఎంతో మంది స్టార్ హీరోలతో సినిమాలను తెరకెక్కించి ఎన్నో సంచలన విజయాలను అందుకున్నారు వి.వి.వినాయక్. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలందరితో వి.వి.వినాయక్ సినిమాలు చేశారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక దర్శకత్వం లో తనదైన మెలకువలతో సినిమాలను తెరకెక్కించి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు వినాయక్. ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. ఇప్పటికీ స్టార్ డైరెక్టర్ గా వివి v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అయితే స్టార్ డైరెక్టర్గా ఎదిగిన వివి v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ తన సొంతూరు తో ఎంతగానో అనుబంధం ఉంది. 

 

 అయితే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ దర్శకులు రాజమౌళి వివి v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ ఒకటే  నియోజకవర్గం. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గం. రాజమౌళిది కొవ్వూరు అయితే వి.వి.వినాయక్ చాగల్లు. అయితే వి.వి.వినాయక్ ది అప్పట్లో సంపన్నుల కుటుంబమే అని చెప్పాలి. ఎందుకంటే అప్పట్లో వి.వి.వినాయక్ తండ్రి ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఉండేవారు. ఓవైపు ధాన్యం వ్యాపారం చేస్తూ రైస్ మిల్లు నిర్వహిస్తూనే మరోవైపు... ఊర్లో ఒక సినిమా థియేటర్ ని కూడా మెయింటెన్ చేసే వారు. ఇక ఆ తర్వాత రాజమండ్రిలో వి.వి.వినాయక్ తండ్రి ఏకంగా 10 థియేటర్లను లీజుకు తీసుకొని నడిపించారు. 

 


 అయితే ఎంతో సంపన్నుల కుటుంబంగా బతికిన వి.వి.వినాయక్ కుటుంబం ఆ తర్వాత కొన్ని కారణాల ద్వారా ఆస్తులు మొత్తం కోల్పోయింది. ఇక ఆ తర్వాత సినిమాల మీద ఆసక్తితో సినిమా రంగంలోకి వచ్చిన వి.వి.వినాయక్ ఎంతో కసితో పని చేసి తెలుగు చిత్ర పరిశ్రమలో అనతి కాలంలోనే స్టార్ డైరెక్టర్గా ఎదిగాడు. మళ్లీ చాగల్లు లో తమ తండ్రి నిర్మించిన థియేటర్ను మళ్లీ డిజైన్ చేసి... వైజాగ్, తూర్పు గోదావరి జిల్లాల్లో కూడా పలు థియేటర్ లు  కొన్నారు వివి వినాయక్. ఇక తన పుట్టిన ఊరు అయినా చాగల్లు అంటే వి.వి.వినాయక్ కు ఎంతో ఇష్టం. ముఖ్యంగా తమ గ్రామానికి తన తండ్రి సర్పంచ్ చేయాలని అనుకున్న వి.వి.వినాయక్.. అనుకున్నది సాధించి  తన తండ్రిని చాగల్లు గ్రామానికి సర్పంచ్ గా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: