ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైన హీరోగా ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్నారు దగ్గుబాటి వెంకటేష్. నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా రాణిస్తున్నారు. అయితే దగ్గుబాటి ఫ్యామిలీ ఎన్నో దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో సుస్థిర స్థానం ఏర్పరుచుకుని ఒక ప్రత్యేక ప్రస్థానం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. తండ్రి దగ్గుబాటి రామానాయుడు  నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో ఏళ్ల పాటు సేవలందించిన  మహోన్నత వ్యక్తిగా ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను ఏకంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సైతం పొందారు.  ప్రస్తుతం దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా నిర్మాత సురేష్ బాబు, హీరో వెంకటేష్ కొనసాగుతున్నారు. 

 

 కాగా దగ్గుబాటి రామానాయుడు సొంత ఊరు ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం కారంచేడు. కారంచేడులో ఎంతో ఉన్నతమైనటువంటి కుటుంబం దగ్గుబాటి రామానాయుడు ది. కారంచేడు లో జన్మించిన దగ్గుబాటి రామానాయుడు ఆ తర్వాత...  దాన్యం వ్యాపారం చేసేవారు అని చెబుతూ ఉంటారు.. ఆయనకు ప్రత్యేకంగా కొన్ని రైస్ మిల్లులు  కూడా ఉన్నాయి అని అంటారు. అయితే దాన్యం వ్యాపారం నుంచి చిత్ర పరిశ్రమకు పరిచయమైన దగ్గుబాటి రామానాయుడు నిర్మాతగా ఎదిగారు. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ గొప్ప నిర్మాత గా మారిపోయారు దగ్గుబాటి రామానాయుడు. 

 


 ప్రస్తుతం దగ్గుబాటి రామానాయుడు ఇద్దరు వారసులు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో తమకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్నారు . దగ్గుబాటి రామానాయుడు పెద్దకొడుకు సురేష్ బాబు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ నిర్మాతగా  కొనసాగుతుంటే చిన్న కొడుకు వెంకటేష్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. అయితే దగ్గుబాటి రామానాయుడు ఎంత ఎదిగినప్పటికీ ఎప్పుడూ ఒదిగి  ఉన్నారు. ముఖ్యంగా ఆయన సొంతూరు కారంచేడు పై ఎంతో మమకారం ఉండేది దగ్గుబాటి రామానాయుడుకి . ఆయన సొంతూరు అభివృద్ధికి ఎంతగానో తోడ్పటును  అందించేవారు. అలాగే బాపట్ల నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున 1999లో ఎంపీగా కూడా గెలుపొందారు దగ్గుబాటి రామానాయుడు. ఇక ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ఫండ్స్ తో కారంచేడు సహా చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు రామానాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: