నాచురల్ స్టార్ నాని ప్రసుత్తం శివ నిర్వాణ డైరక్షన్ లో టక్ జగదీశ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే నాని, రాహుల్ సాంకృత్యన్ డైరక్షన్ లో శ్యామ్ సింగ రాయ్ మూవీ లాంచ్ చేశారు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. నాని నటించిన వి రిలీజ్ కు రెడీ అవగా టక్ జగదీశ్ మరికొద్దిరోజుల్లో పూర్తి కానుందట. శ్యామ్ సింగ రాయ్ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రయోగాత్మక సినిమాగా తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టడమే బెటర్ అని భావిస్తున్నాడట నాని. 

 

నాని కెరియర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో శ్యామ్ సింగ రాయ్ సినిమా చేయాలని అనుకున్నారు కానీ నాని మాత్రం ఆ సినిమా వద్దని అనుకుంటున్నాడట. ఆ సినిమా బదులుగా కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. అంతేకాదు ఆ మూవీలో నాని తెలంగాణా యాసలో మాట్లాడతాడట. రాహుల్ సాంకృత్యన్ డైరక్షన్ లో సినిమాను పాన్ ఇండియా మూవీగా తీయాలని భావించారు. కానీ ఆ సినిమా మొదలు అవడానికి ముందే క్యాన్సిల్ చేసే ఆలోచనలో ఉన్నారట.

 

ఇప్పుడున్న పరిస్థితుల్లో భారీ బడ్జెట్ సినిమాలు చేసి రిస్క్ చేయడం ఎందుకని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. సో కొన్నాళ్ల పాటు తక్కువ బడ్జెట్ సినిమాలే తీసే ఆలోచనలో ఉన్నారు. ఆ సినిమా పక్కన పడేసి కొత్త సినిమా కోసం వేట మొదలుపెట్టాడని తెలుస్తుంది. శివ నిర్వాణ సినిమా పూర్తి చేసి ఆ సినిమా రిలీజ్ చేసిన తర్వాతనే నెక్స్ట్ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.                                

మరింత సమాచారం తెలుసుకోండి: