సిని సెలబ్రిటీలకు సంబంధించి ఏదైనా మ్యారేజ్ అప్డేట్ కానీ లవ్ అప్డేట్ కానీ వచ్చింది అంటే అది సోషల్ మీడియాలో తెగ వైరల్ ఐపోతోంది అనే విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో యువ హీరోలందరూ... మొన్నటివరకు బ్యాచిలర్ గా ఉన్న వాళ్ళు అందరూ ప్రస్తుతం వరుసగా ఓ ఇంటివాళ్లు  అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నిఖిల్ నితిన్ రానా.. ఓ ఇంటి వారయ్యారు కూడా. ఇక ఒక్కొక్కరి పెళ్లి జరుగుతున్న కొద్దీ బాచిలర్ హీరోలందరూ మరో వికెట్ పడిపోయింది అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మరో యువ హీరో పెళ్లి గురించి హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ యువ  హీరో ఎవరో కాదు మెగా ఫ్యామిలీ నుంచి మెగా అభిమానులందరికీ మెగా ప్రిన్స్  గా మారిపోయిన వరుణ్ తేజ్ . 

 

 ఇప్పుడు ఈ హీరో కి సంబంధించిన పెళ్లి వార్త ఎందుకు హల్చల్ చేస్తుంది అంటే... రీసెంట్ గా వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు సోషల్ మీడియా వేదికగా వచ్చే ఏడాది నిహారిక పెళ్లి చేస్తామని ఆ వెంటనే వరుణ్ తేజ్ పెళ్లి కూడా జరిగి పోతుంది అంటూ ఓ వీడియోలో తెలియజేశారు. దీంతో అప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా వరుణ్ తేజ్  పెళ్లికి సంబంధించిన వార్త హల్చల్ చేస్తోంది. దీంతో త్వరలో మరో వికెట్ కూడా పడబోతుంది అని బాచిలర్ హీరోలు అందరూ అనుకుంటున్నారు. అయితే తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్... ఏంటి బావ నీకు పెళ్లి అంట కదా అంటూ చేసిన ఒక పోస్ట్... ఈ పోస్ట్ కు బదులుగా నిజమా అంటూ సంగీత దర్శకుడు తమన్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. 

 

 ఇదే కాదు  సోషల్ మీడియాలో ఎక్కడ  చేసిన వరుణ్ తేజ్ పెళ్లి గురించిన వార్తలు హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. ఇక ఈ పెళ్లి గురించి వచ్చిన ఓ వార్త క్లిప్ ను  కూడా వరుణ్ తేజ్ తేజ్ కు తన ఖాతా నుండి పోస్ట్ చేశారు సాయి తేజ. మరి నిజంగానే మెగా ప్రిన్స్  వరుణ్ తేజ్  త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడ... ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడు... అనే చర్చ మాత్రం ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతోంది. అదేంటో కానీ ఇప్పుడు వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న అందరు హీరోలు ప్రస్తుతం... పెళ్లి పై మొగ్గు చూపుతూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోతున్నారు. ఇలా అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో బ్యాచిలర్ హీరోలు ఉండరేమో అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: