తెలుగు సినిమాల్లో వారసత్వం ఘనంగా చాటుకున్న కుటుంబాల్లో అక్కినేని కుటుంబానికి ఘన కీర్తి ఉంది. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా నాగార్జున సినీ ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగుతోంది. సరిగ్గా 34 ఏళ్ల క్రితం విక్రమ్ సినిమాతో తెరంగేట్రం చేసిన నాగార్జున తెలుగు సినిమాల్లో తనదైన ముద్ర వేశారు. నాగేశ్వరరావు కొడుకు నుంచి యువసామ్రాట్ గా ఎదిగి నేడు కింగ్ నాగార్జునగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు. సినీ పరిశ్రమలోకి వచ్చిన ఇన్నేళ్లలో నాగార్జున ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు.

IHG

 

1989 నాగార్జునకు స్వర్ణయుగం అని చెప్పాలి. గీతాంజలిలో తన హెయిర్ స్టైల్ తో కొత్త ఒరవడిని తీసుకొచ్చాడు. అదే ఏడాది వచ్చిన శివ బ్లాక్ బస్టర్ కొట్టి తెలుగు సినిమా గమనాన్నే మార్చేసింది. ఈ సినిమాలతో నాగార్జున యూత్ ఐకాన్ గా మారిపోయాడు. శివ తర్వాత ఫ్లాపులొచ్చినా ప్రెసిడెంట్ గారి పెళ్లాం నుంచి వరుస హిట్లు ఇచ్చి యూత్ ని విశేషంగా ఆకట్టుకున్నాడు. నాగార్జున కెరీర్లో మరో మైలురాయిగా నిలిచిపోయిన సినిమా అన్నమయ్య. ఈ సినిమాతో నాగార్జున నటన మరోస్థాయికి వెళ్లింది. పలు హిందీ సినిమాలు చేసి ఉత్తరాదిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళ్ లో కూడా నాగ్ కు మంచి ఆదరణ ఉంది.

IHG

 

2003లో వచ్చిన మన్మధుడు సినిమా నాగ్ కెరీర్లో మరో సంచలనం. నాగ్ అందానికి తగ్గట్టు కథ, టైటిల్ కుదరడంతో తెలుగు సినిమా మన్మధుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇన్నేళ్ల కెరీర్లో నాగ్ ప్రయోగాలకు వెరవ లేదు. కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ ను నాగేశ్వరరావు లెగసీని అదేస్థాయిలో ముందుకు తీసుకెళ్లాడు. తనయులిద్దరినీ హీరోలు చేసి వారి ఎదుగుదలను ప్రోత్సహిస్తున్నాడు. ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో నాగ్ ఇప్పటికీ ఎనర్జటిక్ లుక్ లో ఉండటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: