రకుల్ ప్రీత్ సింగ్ బ్యూటీ, ఫిట్ నెస్ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ప్రతి రోజూ తనదైన శైలిలో వ్యాయామాలు చేస్తూ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ తాను చేసే వ్యాయామాలకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియా ద్వారా  అభిమానులకు షేర్ చేయడం జరిగింది. అలాగే ఈ లాక్ డౌన్ సమయంలో వర్క్ ఔట్స్ విషయాల గురించి కూడా తెలియజేసింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

This lockdown has pushed me to do 108 surya namaskars atleast 2-3 times a week and The feeling post practice is indescribable ❤️❤️ #sunsalutation helps you build inner and outer strength , create mind body balance and churns every organ of your body to release toxins 🧘‍♀️🧘‍♀️ @anshukayoga 😘 #morningroutine #balanceoflife

A post shared by rakul Singh (@rakulpreet) on


తాను లాక్ డౌన్ సమయంలో రెండు మూడు రోజులకు ఒక సారి 108 సూర్య నమస్కారాలు చేస్తున్నాను అని తెలియజేసింది. వాస్తవానికి ఈ ఫీలింగ్ వర్ణించలేనిది అంటూ రకుల్  తెలియజేసింది. ఇలా  సూర్యనమస్కారాలు చేయడం వల్ల అంతర్గత బాహ్య బలం పెంచుకోవచ్చు అని చెప్పుకుని వచ్చింది. అలాగే శరీరంలోని ప్రతి అవయవం నుండి అనవసరమైన వ్యర్థాలను తొలగించడానికి ఇది చాలా సహాయపడుతుంది అంటూ రకుల్ తెలియజేయడం జరిగింది.


ప్రస్తుతం ఈ బ్యూటీ నితిన్ తో జతకడుతూ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుంది. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వహిస్తున్న ఇండియన్ 2 సినిమాలో కూడా ఈ బ్యూటీ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇదిలా ఉండగా మరోవైపు హాలీవుడ్ లో కూడా అర్జున్ కపూర్ హీరోగా రాబోతున్న ఒక రొమాంటిక్ కామెడీ సినిమాలో కూడా రకుల్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: