టాలీవుడ్ లో మాస్ ఇమేజ్ తో దూసుక పోతున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఆ మద్య త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అజ్ఞాతవాసి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  అయితే ఈ మూవీ అనుకున్న అంచనాలు మాత్రం అందుకోలేకపోయింది. అదే సమయంలో ఏపిలో ఎన్నికలు రావడం ‘జనసేన’ పార్టీ నుంచి పవన్ కళ్యాన్ పోటీచేయడం.. ఓడిపోవడం అన్నీ జరిగిపోయాయి. దాంతో సినిమాలకు చాలా గ్యాప్ తీసుకున్నారుపవన్ కళ్యాన్. ఒకదశలో అసలు సినిమాల్లోనే నటించరని భావించారు.  కానీ ఇప్పుడు సీన్ రివర్స్అయ్యింది.. పవన్ కళ్యాన్ ఒకటి కాదు రెండు కాదు నాలుగు మూవీలు వరుస బెట్టి నటిస్తున్నారు.  వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాన్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

 

మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని థియేటర్లోకి రావాల్సి ఉన్నా కరోనా వల్ల అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. తాజాగా సీఎం కేసీఆర్‌తో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు చ‌ర్చ‌లు జ‌రిపిన త‌ర్వాత థియేట‌ర్స్ రీ ఓపెన్‌పై కాస్త స్ప‌ష్ట‌త వ‌చ్చింది. ఆగ‌స్ట్‌లో తిరిగి థియేట‌ర్స్ ఓపెన్ అవుతాయ‌నే ఓ ప్రచారం నడుస్తున్న నేప‌థ్యంలో ముందుగా వ‌చ్చే సినిమా పవర్ స్టార్   ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన వకీల్ సాబ్ అని టాక్.  దాదాపు రెండేళ్ళ త‌ర్వాత ప‌వ‌న్ తిరిగి మేక‌ప్ వేసుకోగా, ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.  

 

ఆగ‌స్ట్‌లో తిరిగి థియేట‌ర్స్ ఓపెన్ అవుతాయ‌నే ఓ ప్రచారం నడుస్తున్న నేప‌థ్యంలో ముందుగా వ‌చ్చే సినిమా ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన వకీల్ సాబ్ అని అంటున్నారు.  దాదాపు రెండేళ్ళ త‌ర్వాత ప‌వ‌న్ తిరిగి మేక‌ప్ వేసుకోగా, ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. వ‌కీల్ సాబ్ ముందు విడుద‌లైతే జ‌నాల‌లోను కాస్త జోష్ వ‌స్తుంద‌ని భావించి ఈ సినిమాని ముందుగా రిలీజ్ చేస్తార‌నే టాక్ న‌డుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: