ఇప్పుడు సినిమాలో ఎంత వైవిధ్యం ఉంటే సినిమా అంత బాగా ఆడుతుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందుకే హీరోలు ఇప్పుడు ఎక్కువగా తమ సినిమాల్లో వైవిధ్యం చూపించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్న చిన్న హీరోలు కూడా తమ సినిమాలో వైవిధ్యం ఉండే విధంగా కష్టపడుతున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఒక విషయం బయటకు వచ్చింది. మహేష్ బాబు తన సినిమా కోసం తీవ్రంగా  కష్టపడుతున్నాడు అనే వార్తలు మనం చదువుతూనే ఉన్నాం. అతను ఇప్పుడు భారీగా బరువు కూడా పెరిగే ప్రయత్నాల్లో ఉన్నాడు అనేది చదువుతున్నం. 

 

మహేష్ బాబు తన సినిమాలో ఒక కన్ను కనపడని వాడిగా నటిస్తున్నాడని అలాగే మానసిక రోగిగా కూడా నటిస్తున్నాడు అని తెలుస్తుంది. అతను ఒక సైన్స్ విద్యార్ధి అని అందులో భాగంగా అతనికి కన్ను పోతుందని అలాగే అతనికి చెవులు కూడా వినపడే అవకాశం ఉండదు అని అంటున్నారు. మరి ఈ సినిమాలో మహేష్ బాబు ఏ విధంగా నటిస్తాడు అనేది చూడాలి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కథ ను కాస్త మార్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి మహేష్ బాబు ఇప్పుడు ఈ సినిమాకు ఇంకెంత కష్టపడతాడు అనేది చూడాలి. 

 

ఇప్పుడు అతను రాజమౌళి సినిమా కథ కూడా విన్నాడని ఆ కథలో కొన్ని మార్పులను అతను సూచించినట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది రాజమౌళి తో సినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక మహేష్ బాబు ఇప్పుడు తన పిల్లలతో కలిసి లాక్ డౌన్ ని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంట్లో నుంచి అసలు బయటకు కూడా రావడం లేదు మహేష్ బాబు. వీడియో లు విడుదల చేస్తూ అభిమానులకు కాస్త వినోదాన్ని పంచె ప్రయత్నం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: