ఓ వైపు లాక్ డౌన్ ఉంది. నాలుగవ విడత నడుస్తోంది. మరో వారంలో అది కూడా ఎత్తేయవచ్చునని అంటున్నారు. లేకపోతే మరిన్ని సడలింపులు కూడా ఇస్తారు. ఇవన్నీ ఎలా ఉన్నా సినిమా షూటింగులకు అనుమతి కోరుతూ టాలీవుడ్ పెద్ద తలకాయలు తెలంగాణా సర్కార్నితాజాగా  కోరాయి. దానికి ఆయన కూడా  ఎస్ అనేశారు.

 

ఇక బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తొందరలోనే దేశమంతటా సినిమా షూటింగులకు అనుమతి ఇస్తామని చెప్పారు. ఇవన్నీ బాగానే ఉన్నా ఒక కీలకమైన ప్రశ్న అందరిలోనూ ఉంది. అదేంటి అంటే కరోనా వైరస్ ఓవైపు ఉగ్ర రూపం చూపిస్తోంది. సడలింపులు ఇచ్చేశాక ఒక్కసారిగా కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయి.

 

దాంతో కలసి జీవించాలని పాలకులు చెబుతున్నారు. ఏ రంగంలో అయినా ఫరవాలేదు కానీ సినిమా షూటింగులు అంటే కష్టమే మరి. ఇక అరవైలు దాటిన హీరోలు అయితే బెదురుతున్నారని కూడా టాక్. ఎందుకంటే హై రిస్క్ వారికే ఉంటుంది కాబట్టి. ఓ వైపు సినిమా షూటింగులకు అనుమతి కోరుతున్న టాలీవుడ్ పెద్దలు తమ హీరోలు సిధ్ధమా  కాదా అన్నది చూసుకుంటున్నారా అన్నది ఒక చర్చగా ఉంది.

 

దీని మీద కేసీయార్ కూడా తన డౌట్ వ్యక్తం చేశారట. కరోనా అంతటా ఉంది. దానితోనే కలసి ప్రయాణం చేయాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న రిక్స్ తప్పదు అని అంటున్నారు. అందువల్ల షూటింగులు నిజంగా పెడితే మీ హీరోలు ఎంతమంది వస్తారని కేసీయార్ అడిగినట్లుగా ప్రచారం జరిగింది.

 

 

ఇప్పటికైతే కొంతమంది హీరోలు వ్యాక్సిన్ వచ్చేంత వరకూ వెయిట్ చేయాలని అనుకుంటున్నారుట. ఎందుకు అనవసరంగా రిస్క్ అని ఆలోచిస్తున్నారుట. చూడాలి మరి. ఏది ఏమైనా సినిమాలకు ఇది కానికాలమని, కాస్తా ఆగాలని కూడా మరో వైపు టాలీవుడ్ పెద్దలు, సీనియర్లు కూడా అంటున్నట్లుగా భోగట్టా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: