ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గా తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో రెండు ద‌శాబ్దాలుగా చెర‌గ‌ని ముద్ర వేసుకున్న ఈ స్టార్ హీరో ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల్లోనూ బిజీ బిజీగా ఉన్నారు. జ‌న‌సేన అధినేత‌గా ప్ర‌జ‌ల మ‌న‌స్సుల‌ను గెలుచుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప‌వ‌న్ ఇప్ప‌టికే రెండున్న‌ర ద‌శాబ్దాల త‌న సినిమా ప్ర‌స్తానం విజ‌య‌వంతంగా కొన‌సాగిస్తున్నారు. సినిమాల‌కు కాస్త గ్యాప్ ఇచ్చిన ప‌వ‌న్ ప్ర‌స్తుతం వ‌కీల్ సాబ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు.

 

ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన కొడుకు అఖీరా సినిమాల్లో పరిచయం చేయడానికి గానూ కాస్త కష్టపడుతున్నారు. కొడుకుని ఏ విధంగా అయినా సినిమాల్లోకి తీసుకొచ్చి హీరో ని చెయ్యాలని భావిస్తున్నారు. ఈ తరుణంలోనే పవన్ కి చిరంజీవి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. తన సినిమాలో ముందు పవన్ కొడుకు అఖీరా ని పరిచయం చేస్తా అని ఆ తర్వాత లూసిఫర్ సినిమాలో కూడా తీసుకుంటా అని చెప్పినట్టు సమాచారం. 

 

ఇక ఆ వెంటనే రామ్ చరణ్ తో ఒక సినిమా చేయిస్తా ముందే హీరోగా వద్దు అని చెప్పారట చిరంజీవి. దీనికి పవన్ కూడా ఓకే చెప్పినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి చర్చలు కూడా జరుగుతాయని అప్పుడు అకీరా ని సినిమాల్లోకి తీసుకుని రావడంపై ఒక అభిప్రాయానికి వచ్చి చిరంజీవి  ముందుకు అడుగు వేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక రేణు దేశాయ్ కి కూడా ఇదే విషయాన్ని చెప్పారట. 

 

ఆమె కూడా అందుకు అంగీకరించింది అని సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆచార్య లో అకీరా కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం. మరి చిరంజీవి తీసుకుంటారా లేదా అనేది చూడాలి. ఇక పవన్ కళ్యాణ్ కూడా రామ్ చరణ్ తో ఇప్పటికే మాట్లాడినట్టు సమాచారం. అకీరా కొన్ని రోజులుగా రామ్ చరణ్ వద్దనే ఉంటున్నాడు అని తెలుస్తుంది. యాక్టింగ్ ని కూడా నేర్చుకుంటున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: