మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఫైట్లు, డ్యాన్సులు ఎలా ఉంటాయో అనే సగటు మెగా అభిమాని ఆలోచిస్తాడు. ప్రేక్షకులు కూడా ఇవే అంచనాలతో చిరంజీవి సినిమాలకు వస్తారు. చిరంజీవి విషయంలో ప్రేక్షకాభిమానులు ఇలాంటి అంచనాలు పెంచుకోవడం సాధారణ విషయం. చిరంజీవి మెగాస్టార్ క్రేజ్ కు ఆయన మాస్ అప్పియరెన్స్, కామెడీ, ఫైట్లు, డ్యాన్స్ లే ముఖ్య కారణం. అయితే.. వీటన్నింటికీ భిన్నంగా చిరంజీవి చేసిన ఓ రొమాంటిక్ సీన్ ప్రేక్షకుల్నే కాకుండా మెగాభిమానులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది.

IHG

 

గుణశేఖర్ దర్శకత్వంలో చిరంజీవి చేసిన చూడాలని ఉందిసినిమాలో ట్రైన్ ఎపిసోడ్ లో ఈ సీన్ వస్తుంది. నాయనమ్మను రిసీవ్ చేసుకునేందుకు రైల్వే స్టేషన్కు వెళ్లిన చిరంజీవికి అక్కడే ప్లాట్ ఫాంపై ఉన్న ట్రైన్ లో హీరోయిన్ అంజలా ఝవేరి కనిపిస్తుంది. దీంతో చిరంజీవి అక్కడే ఓ బెంచ్ పై కూర్చుని హీరోయిన్ వైపే చూస్తూ ఉండిపోతాడు. అంజలా కూడా అనుకోకుండా చిరంజీవిని చూస్తుంది. ఇక్కడే ఈ సన్నివేశాన్ని గుణశేఖర్ అద్భుతంగా తీశాడు. వయసులో ఉన్న ఇద్దరు యువతీ యువకుల మధ్య చూపులు కలిస్తే ఎలా ఉంటుందో అలానే తీశాడు. అక్కడ చిరంజీవి-అంజలా ఎక్స్ ప్రెషన్స్ ను చాలా అందంగా తెరకెక్కించాడు గుణశేఖర్.

IHG

 

చోటా ఫొటోగ్రఫీ, మణిశర్మ సంగీతం ఈ సన్నివేశాన్ని సినిమాకే హైలైట్ గా నిలిపాయి. ఈ సినిమా సమయానికి చిరంజీవి వయసు 43. పైగా.. మాస్ హీరోగా తిరుగులేని క్రేజ్. మొదట ఈ సీన్ చేయడానికి చిరంజీవి సంశయించారట. యువ హీరోలా లవ్ సీన్ చేసే వయసు కాదు. ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో అని అన్నారట. కానీ గుణశేఖర్ ఒప్పించడంతో చిరంజీవి ఆ సన్నివేశాన్ని తనదైన స్టైల్లో చేశారు. దీంతో ఆ సీన్ ఇప్పటికీ హాట్ ఫేవరేట్ గా నిలిచిపోయింది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: