అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయిదు భాషల్లో పాన్ ఇండియా సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమా తో పాటు అల్లు అర్జున్ కొత్త సినిమా ఐకాన్ కూడా మొదలవబోతుందని తాజా సమాచారం. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ ని తెరకెక్కిస్తున్నాడు. దాదాపు ఈ సినిమా కంప్లీటవచ్చింది. మరో నెలరోజుల ప్రీ అండ్  పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది.

సినిమా కంప్లీటవగానే ఐకాన్ ని మొదలు పెడతాడని తెలుస్తుంది. వాస్తవంగా ఈ సినిమా ఎప్పుడో చేయాల్సింది. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల పెండింగ్ పడింది. దాంతో ఐకాన్ సినిమా ఆగిపోయిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి ఇటీవల దిల్ రాజు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఈ ప్రాజెక్ట్ ఉందని కన్‌ఫర్మ్ చేస్తూ ఐకాన్ పోస్టర్ తో అల్లు అర్జున్ కి బర్త్ డే విషెస్ చెప్పి క్లారిటీ ఇచ్చాడు. అయితే అప్పటి నుంచి ఈ సినిమా ఎపుడు ఉంటుందా అని బన్ని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

 

ఎట్టకేలకి ఈ సినిమా త్వరలో మొదలవబోతుందని సమాచారం. ఇక ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఐకాన్ టైటిల్  కనపడుట లేదు అనే క్యాప్షన్ తో రూపొందబోయో ఈ సినిమాకి సంబంధించిన మిగతా విషయాలు, టెక్నికల్ టీం వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. మొత్తానికి యంగ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ బ్యాక్ టు బ్యాక్ మెగా హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు అందుకొని ఇండస్ట్రీ హాట్ టాపిక్ అయ్యాడు.  

 

ఇక అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకి రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతమందిస్తుండగా కన్నడ బ్యూటి రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో ఉన్న మాస్ ఐటం సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటిస్ దిశా పఠాని, ఊర్వశి రౌతెలా పేర్లు పరిశీలనలో ఉన్నాయట. 

మరింత సమాచారం తెలుసుకోండి: