కరోనా మహమ్మారితో గత రెండు నెలలుగా లాక్ డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ మొత్తం షట్ డౌన్ అయిన సంగతి తెలిసిందే. వందల కార్మీకులు షూటింగ్స్ లేక అల్లాడిపోయారు. ఇక నిర్మాతలు ఆర్ధికంగా కృంగిపోయారు. చిన్న సినిమా నుండి భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా రేంజ్ సినిమాల వరకు అన్ని ఆగిపోయాయి. 24 విభాగాలలో ఏ ఒక్కటి పనిచేయలేదు. ఇది టాలీవుడ్ కి ఇప్పట్లో కోలుకోలేని దెబ్బే. ఒక వైపు షూటింగ్ బంద్..మరో వైపు థియోటర్స్ బంద్ కావడంతో అన్ని చిత్ర పరిశ్రమలు వెల వెలబోయాయి. 

 

అయితే ఇటీవల సినిమాటోగ్రఫీ మంత్రి, ముఖ్య మంత్రి తో టాలీవుడ్ ప్రముఖులు జరిపిన చర్చలు ఫలించాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకోవడానికి అనుమతులు ఇచ్చారు. అలాగే త్వరలో షూటింగ్స్ కూడా ప్రారంభించేందుకు అనుమతులు ఇవ్వనున్నారు. జూన్ నుంచి అన్ని సినిమాల షూటింగ్స్ మొదలయ్యో అవకాశాలున్నాయి. టీవీ షూటింగ్స్ సినిమా షూటింగ్స్ తో మళ్ళీ చిత్ర పరిశ్రమ కళ కళ లాడబోతోంది.

 

షూటింగ్స్ మొదలైతే కరోనా నిబంధనలతో అతి కొద్దిమంది యూనిట్ పాల్గొనే సన్నివేశాలను చక చకా కంప్లీట్ చేయడానికి నిర్మాతలు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ముందుగా వకీల్ సాబ్ షూటింగ్ మొదలవబోతుందని తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమాకి మొత్తం వర్క్ కేవలం నెలరోజులు మాత్రమే పెండింగ్ ఉందని దర్శకుడు ఇదివరకే వెల్లడించాడు. ఇక ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ సినిమాకి, ప్రభాస్ సినిమాకి సెట్స్ సిద్దంగా ఉన్నాయి.

 

అలాగే మెగాస్టార్ సినిమా ఆచార్య, అల్లు అర్జున్ పుష్ప, పూరి విజయ్ దేవరకొండల తాజా చిత్రం, నాగ చైతన్య సాయి పల్లవిల లవ్ స్టోరీ, క్రిష్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ..ఇలా భారీ సినిమాల షూటింగ్ మొదలవడంతో టాలీవుడ్ కి పూర్వ వైభవం రాబోతుంది. ఇక ధియోటర్స్ కూడా ఓపెన్ అయితే మళ్ళీ మన సినిమా ఇండస్ట్రీ కి ఉండే ఆ కళే వేరు.   

మరింత సమాచారం తెలుసుకోండి: