విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘నారప్ప’. రీసెంట్ గా విడుదలైన వెంకటేష్ ఫస్ట్‌లుక్, పోస్టర్లు వెంకీ ఫ్యాన్స్ నే కాదు కామన్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. తమిళ సూపర్ హిట్ సినిమా ‘అసురన్’కు అఫీషియల్ రీమేక్ గా నారప్ప తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కొత్త బంగారు లోకం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి భారీ మల్టీ స్టారర్ ని తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను సమ్యుక్తంగా నిర్మిస్తున్నారు. అనంతపురం జిల్లాలో ప్రారంభమైన షూటంగ్ కొంత టాకీ పార్ట్ కంప్లీటయ్యాక లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడింది.

 

ఇక మొదటి సినిమా ముకుంద నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్ లు అందుకుంటున్నాడు మెగా ప్రిన్స్  వరుణ్ తేజ్.  సినిమా సినిమాకి టాలీవుడ్ లో మరే హీరో చూపించనన్ని వేరియేషన్స్ చూపిస్తూ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక గత ఏడాది ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న వరుణ్ ప్రస్తుతం మరో విభిన్నమైన కథతో రెడీ అవుతున్నాడు. కొరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సర్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది.

 

అయితే వెంకటేష్, వరుణ్ తేజ్ ఇలా ఎవరికి వారు తమ సినిమాలతో బిజీగా ఉండటంతో ఇప్పుడు సక్సస్ ఫుల్ డైరెక్టర్ చిక్కుల్లో పడ్డాడట. ఈ ఇద్దరితో ఎఫ్ 2 తీసి బ్లాక్ బస్టర్ ని అందుకున్న అనిల్ రావిపూడి ఎఫ్ 3 కి సిద్దమవుతున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో సంక్రాంతి సెంటిమెంట్ ని మిస్ అవకుండా హ్యాట్రిక్ హిట్ కొట్టాలనుకున్నాడు. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో సినిమాలన్ని డిలే అయిన సంగతి తెలిసిందే. దాంతో ఆ ఎఫెక్ట్ అనిల్ రావిపూడి మీద గట్టిగా పడిందని అంటున్నారు. అనిల్ రావిపూడి ఈ ఇద్దరితో సినిమా తీయాలంటే ఇంకా సమయం పడుతుండటమే అందుకు కారణం.  

మరింత సమాచారం తెలుసుకోండి: