తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నప్పటికీ తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ అయితే ఆగడం లేదు. శనివారం నాడు కొత్తగా 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, జీహెచ్ఎంసీ పరిధిలో 33 కేసులు నమోదు కాగా వలస వచ్చిన వారి నుండి 19 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో వెల్లడించింది.

 

వీరిలో మహారాష్ట్ర నుంచి వచ్చిన వారు 14 మంది ఉండగా, కువైట్ నుంచి వచ్చిన వారిలో నలుగురికి కోవిడ్ పాజిటివ్ అని తేలిందన్నారు. ఇలా మహారాష్ట్ర నుండి వచ్చిన వలస కార్మికులు మరియు సిటిజన్లు కువైట్ దేశస్థులతో కలిసి వైరస్ వ్యాప్తిని పెంపొదిస్తున్నారు నై రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ వాపోతోంది.

 

ఇదిలా ఉంటే శనివారం 25 మంది ఇన్ఫెక్షన్ నుంచి కోలుకోగా.. మొత్తం 1068 మంది కరోనా నుంచి కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 696 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో కోవిడ్ బారిన పడిన వారిలో 59 శాతం మంది డిశ్చార్జ్ అయిన వారు 59 శాతం మంది ఉండగా.. 3 శాతం మంది ప్రాణాలు కోల్పోయారు.

 

ఇక పోతే గత రెండు రోజులుగా నమోదు అయిన కేసుల్లో వారిలో 19 మంది వలస వెళ్లి వచ్చిన వారే కావడం గమనార్హం. జగిత్యాల జిల్లాలోనే 9 మందికి పాజిటివ్ అని తేలగా.. వీరందరూ ముంబై నుంచి వలస వచ్చిన వారే

 

ఇప్పటివరకు 137 మంది వలస కూలీలకు కరోనా సోకింది. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే.. వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, గద్వాల వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటనలో తెలిపింది. ఇక మిగతా 25 జిల్లాల్లో 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: