టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు ఎందరో నటీనటులు వచ్చారు, వెళ్లారు. ఇక ఎప్పటికప్పుడు కొత్త తరం వారు వస్తూనే ఉన్నారు. అయితే అప్పటి తరంలో మాత్రం సినిమాల్లోకి రావాలంటే మంచి ఆసక్తి ఉన్నప్పటికీ రావడం కష్టంగా ఉండేది. అదే ఇప్పుడైతే సినిమాల్లోకి రావాలంటే కొంతమేర పరిచయాలు ఉంటె చాలు రావచ్చు. అయితే అప్పట్లో హీరోగా స్థిరపడడం కొంత తేలిక అని, అయితే అది ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం చాలా కష్టం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. 

 

ఆ విధంగా ముందుగా ఎన్నో ఏళ్ల క్రితం తొలిసారిగా సీతారామజననం సినిమా ద్వారా సినీ రంగప్రవేశం చేసి, తొలి సినిమా నుండి తన ఆకట్టుకునే అభినయంతో ప్రేక్షకుల మనసులు చూరగొన్న నటుడు అక్కినేని నాగేశ్వర రావు. ఆ తరువాత నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుని వాటిని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగిన అక్కినేని, తన కెరీర్ లో మొత్తం 300కి పైగా సినిమాల్లో నటించారు. కాగా ఆ తరువాత నుండి ఇప్పటివరకు ఎందరో హీరోలు టాలీవుడ్ వెండితెరకు పరిచయమైనప్పటికీ, వారందరిలో కూడా మంచి రొమాంటిక్ కింగ్ గా పేరు దక్కించుకుంది మాత్రం అక్కినేని అనే చెప్పాలి. అప్పట్లో ఆయన నటించిన సినిమాల్లో హీరోయిన్స్ తో మంచి రొమాంటిక్ సీన్స్, ప్రేమ సన్నివేశాలు, ఎక్కువగా ఉండేవి. ఒకానొక సమయంలో అక్కినేని నటించిన ప్రేమనగర్, ప్రేమాభిషేకం, ప్రేమమందిరం సహా అనేక సినిమాల్లో ఆయన రొమాంటిక్ ఫీల్ ఉన్న పాత్రల్లోనే నటించడం జరిగింది. 

 

కాలం మారినా, ఆ తరువాత కూడా మరికొన్నేళ్లు కూడా అదేవిధంగా అక్కడక్కడా కొన్ని సినిమాల్లో నటించిన అక్కినేని, ఆ సమయంలో ఆ తరహా సినిమాలతో యువత మనసులు గెలుచుకున్నారు. ముఖ్యంగా అప్పటి కాలేజీ యువత అక్కినేని రొమాంటిక్ మూవీస్ చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపేవారట. అయితే కాల క్రమేణా ఆయనకు వయసు మీద పడడంతో ఆ తరహా సినిమాలు తగ్గించారు అక్కినేని. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు మరొక నటుడు ఎవరూ కూడా అక్కినేని రేంజ్ లో ఆ విధంగా రొమాంటిక్ హీరో అనే పేరుని దక్కించుకోలేదని ఇప్పటికీ చాలామంది సినిమా అభిమానులు చెప్తూ ఉంటారు. అందుకే అక్కినేనికి అంత గొప్ప పేరువచ్చిందని అంటుంటారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: