టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు, ఇటీవల వరుసగా విజయాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. కాగా అతి త్వరలో ఆయన హీరోగా నటించనున్న నెక్స్ట్ మూవీ అధికారికంగా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తన కెరీర్ మొత్తంలో ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలకే పెద్ద పీట వేసిన సూపర్ స్టార్, మధ్యలో ఎస్ జె సూర్య దర్శకత్వంలో ఇందిరా ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కిన నాని అనే సైన్స్ ఫిక్షన్ సినిమాలో నటించడం జరిగింది. అంతకముందు హాలీవుడ్ లో టామ్ హాంక్స్ హీరోగా వచ్చిన బిగ్ అనే సినిమా యొక్క మూల కథాంశాన్ని తీసుకుని దర్శకుడు సూర్య ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. 

IHG

సరిగ్గా పదహారేళ్ళ క్రితం 2004లో ప్రేక్షకుల ముందుకు ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సినిమాలో చిన్నపిల్లాడిగా మహేష్ బాబు నటనకు మంచి మార్కులు పడ్డప్పటికీ సినిమాలో కొంత రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి అనే ముద్ర కూడా ఈ సినిమాపై పడడం జరిగింది. కాగా ఈ సినిమా నుండి సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ తో కలిసి మహేష్ బాబు మార్కండేయ అనే పల్లవితో సాగె స్పెషల్ సాంగ్ లో నటించడం జరిగింది. అప్పట్లో ఆ సాంగ్ మాత్రం సినిమాలో చేర్చబడలేదు. ఆ సాంగ్ లో హీరోయిన్ రమ్యకృష్ణ తో కలిసి మహేష్ మంచి రొమాంటిక్ ఫీల్ తో నటించడం జరిగింది. అలానే ఆ సినిమా మధ్యలో కొన్ని సీన్స్ లో హీరో మహేష్, హీరోయిన్ అమీషా పటేల్ మధ్య గుర్రం ఎక్కడం అంటూ వచ్చే సన్నివేశాలు కూడా కొంత రొమాంటిక్ ఫీల్ తో సాగుతాయి. 

 

ఒకరకంగా చెప్పాలంటే మహేష్ బాబు మొత్తం కెరీర్ లో నాని సినిమా ఒకింత ప్రత్యేకం అని చెప్పడంతో పాటు ఆ తరహా రొమాంటిక్ ఫీల్ టచ్ ఉన్న మూవీ మరొకటి మహేష్ ఎప్పుడూ చేయలేదనే చెప్పాలి. రిలీజ్ తరువాత సినిమా పరాజయం పాలవడం, అలానే ఈ తరహా సీన్స్ సినిమాలో ఉండడంతో దర్శకుడు ఎస్ జె సూర్యపై అప్పట్లో కొంత విమర్శలు కూడా వచ్చాయి. కాగా ఇదే సినిమాని దర్శకుడు సూర్య తానే స్వయంగా తమిళ్ లో న్యూ పేరుతో నటించి తెరకెక్కించగా, అక్కడ మాత్రం ఈ సినిమా బాగానే ఆడడం విశేషం....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: