టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుగా బాలనటుడిగా పలు సినిమాల ద్వారా టాలీవుడ్ కి తండ్రి కృష్ణ నటవారసత్వంతో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించి మంచి పేరు దక్కించుకున్న మహేష్, ఆపై కొంత గ్యాప్ తీసుకున్న అనంతరం 1999లో వచ్చిన రాజకుమారుడు తో హీరోగా మారారు. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టిన మహేష్ బాబు, ఆ తరువాత యువరాజు, వంశీ సినిమాల్లో నటించడం జరిగింది. అనంతరం మహేష్ కెరీర్ నాలుగవ సినిమాగా వచ్చిన మురారి, అప్పట్లో అతి పెద్ద విజయాన్ని అందుకుని నటుడిగా మహేష్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. 

IHG

ఇకపోతే ఆ సినిమాలో దర్శకుడు కృష్ణవంశీ అద్భుత దర్శకత్వ ప్రతిభ, హీరో హీరోయిన్లైన మహేష్, సోనాలి బింద్రేల స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోవడం సినిమా సక్సెస్ కు ముఖ్య కారణంగా చెప్పవచ్చు. ఇక సినిమాలో హీరోయిన్ తో తొలి చూపులోనే ప్రేమలోపడే హీరో మహేష్ బాబు, ఆ తరువాత నుండి ఆమె ప్రేమకోసం పలు ప్రయత్నాలు చేయడం, అనంతరం ఆమె కూడా అతడిని ప్రేమిస్తుందని తెలియడం వంటి అంశాలు సినిమాలో ఎంతో బాగుంటాయి. అన్నికంటే ముఖ్యంగా హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే అందమైన లవ్, రొమాంటిక్ సన్నివేశాలు అప్పట్లో మంచి పేరు దక్కించుకున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య హీరో, హీరోయిన్లు ఇద్దరూ కూడా కలిసి చేసే సందడి, పండించే రొమాన్స్ వంటివి అప్పటి యువత తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా ఎంతో ఆకట్టుకున్నాయి. 

IHG's first ...

మొదటి నుండి తన సినిమాల్లో పెద్దగా అసభ్యతకు తావివ్వని దర్శకుడు కృష్ణవంశీ, ఈ సినిమాలో కూడా స్క్రీన్ పై హీరో, హీరోయిన్ల రొమాన్స్ పండించిన తీరు, సాంగ్స్ లో లవ్ ఫీల్, ఎమోషన్ అదిరిపోయే రేంజ్ లో చూపించడం జరిగింది. అలానే దాదాపుగా సినిమాలోని పాటలు అన్ని కూడా వారిద్దరి మధ్య ప్రేమను ప్రతిబించేలా సాగడం వంటివి సినిమాకు మరింత ప్లస్ అవడం జరిగింది. ఈ విధంగా అందరినీ ఆకట్టుకునేలా కృష్ణవంశీ తీసిన మురారి సినిమా యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామాతో పాటు అసభ్యత లేని చక్కని రొమాంటిక్ మూవీ అని కూడా చెప్పవచ్చని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: