ఈ నగరానికి ఏమైంది సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకుని, ఫలక్ నుమా దాస్ సినిమాతో దర్శకుడిగా మారిన విశ్వక్ సేన్ తరచుగా వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటాడు. మొన్నటికి మొన్న హిట్ సినిమాతో హిట్ ని తన ఖాతాలో వేసుకున్న విశ్వక్ సేన్ కి తాజాగా మరో వివాదం చుట్టుకుంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ర్యాప్ సాంగ్ ద్వారా విషెస్ తెలియజేయడమే వివాదానికి కారణమైంది.

 

మాస్ కా దాస్, మాస్ కా బాప్ అనే పాటని ఎన్టీఆర్ కోసం రిలీజ్ చేసిన విశ్వక్ సేన్ పై ఫలక్ నుమా దాస్ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ కంప్లైంట్ చేశాడు. ఫలక్ నుమా దాస్ సినిమాలోని ఆ పాటని ఎలా వాడుకుంటారంటూ విశ్వక్ సేన్ పై సీరియస్ అయ్యాడు. త‌న అనుమ‌తి లేకుండా ఈ పాట‌ను వాడుకున్నాడంటూ వివేక్ అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంతో ర‌గ‌డ మొద‌లైంది. ఈ పాటను తొల‌గించాలంటూ వివేక్ యూట్యూబ్‌లో ఈ సాంగ్ లింక్ కింద కామెంట్ కూడా పెట్టాడు.

 


అయితే విశ్వక్ సేన్ తగ్గలేదు సరికదా, అది నా సినిమాలో పాటంటూ ఇంకా చెలరేగిపోయాడు. నేను ప్రొడ్యూస్ చేసిన సినిమాలోని పాటని ఎలాగైనా వాడుకునే హక్కు తనకి ఉన్నదంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వివేక్ సాగర్ ఆ మాటలని పట్టించుకునేలా కనబడట్లేదు. దాంతో అత‌ను విశ్వ‌క్ మీద లీగ‌ల్ యాక్ష‌న్‌కు కూడా రెడీ అయిపోయాడు. ఆల్రెడీ విశ్వ‌క్‌కు నోటీసులు కూడా వెళ్లిన‌ట్లు సమాచారం.

 


ఇక్కడ విశేషమేంటంటే విశ్వక్ సేన్ వివేక్ సారీ కూడా చెప్పాడు. పాట నా సినిమాకి సంబంధించినదైనా వివేక్ పర్మిషన్ లేకుండా తీసుకోవడం తప్పేనని చెప్తున్నాడు. కానీ ఆ పాటని తొలగించేది లేదని ఖరాఖండిగా మాట్లాడాడు. చిలికి చిలికి గాలివాన అయినట్టు, ఈ చిన్న వివాదం లీగల్ యాక్షన్ ని దారి తీసి ఎక్కడివరకూ వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: