నందమూరి తారకరామారావు పోలికలలో మాత్రమే కాకుండా హావభావాలలో సీనియర్ ఎన్టీఆర్ ప్రింట్ లా కనిపించే జూనియర్ ను తెలుగుప్రజలు ఎన్టీఆర్ నటనా వారసుడుగా పూర్తిగా అంగీకరించారు. కెరియర్ ప్రారంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన జూనియర్ తన లుక్ ను అదేవిధంగా తన నటనను పూర్తిగా మెరుగు పరుచుకుని ఇప్పుడు టాప్ యంగ్ హీరోల రేసులో చాల ముందు వరసలో ఉన్నాడు. 


లాక్ డౌన్ ప్రారంభం అయి షూటింగ్ లకు విరామం దొరకడంతో చిరంజీవిమహేష్ ల దగ్గర నుండి ఎందరో హీరోలు తమ లాక్ డౌన్ పిరియడ్ ను తమ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. అయితే తారక్ మాత్రం తన ఇంటిలో తన పిల్లలతో ఎలా కాలం గడుపుతున్నాడు అన్న విషయానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేయనందుకు అతడి అభిమానులలో కూడ అసంతృప్తి ఉంది. 


ఇలాంటి పరిస్థితులలో గత వారం జరిగిన జూనియర్ పుట్టినరోజునాడు ‘ఆర్ ఆర్ ఆర్’ లోని కొమరం భీమ్ పాత్రకు సంబంధించిన టీజర్ వస్తుందని అభిమానులు ఎంతో ఆశించినా ‘ఆర్ ఆర్ ఆర్’ యూనిట్ జూనియర్ అభిమానుల కోర్కెను తీర్చలేకపోయింది. దీనితో అభిమానులు తమకు చేతనైన స్థాయిలో తమ హీరో పుట్టినరోజు వేడుకల సందర్భంగా సోషల్ మీడియాలో తమ వంతు హడావిడి పెద్ద ఎత్తున చేసారు. 


ఇలాంటి పరిస్థితులలో ఒక్కసారిగా జూనియర్ కాంపౌండ్ లో రాజకీయ కలకలం ఏర్పడటం అభిమానులకు కూడ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా జూనియర్ పుట్టినరోజునాడు ఏమాత్రం ఎటువంటి స్పందనా తెలియచేయని అనేకమంది తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులకు చెందిన కుటుంబ యువ నాయకత్వం ఒకేసారి మూకమ్మడిగా తారక్ పుట్టినరోజును ఆధారంగా చేసుకుని అతడి పుట్టినరోజునాడు జూనియర్ కు బంగారు భవిష్యత్ వేచి ఉంది అంటూ సోషల్ మీడియాలో వందల సంఖ్యలో అనేకమంది తెలుగుదేశం యువనాయకులు అభినందనలు తెలియచేయడం రాజకీయ సినీ వర్గాలలో ప్రస్తుతం హాట్ న్యూస్ గా మారింది. తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉండగా తారక్ ను అంతగా పట్టించుకోని ఈ యువ నాయకులు అందరు ఇప్పుడు జూనియర్ కు బంగారు భవిష్యత్ ఉంది అంటూ సందేశాలు పెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ కొందరు మరికొందరైతే ప్రస్తుత పరిస్థితులలో పార్టీకి పునర్వైభవం రావాలి అంటే జూనియర్ లాంటి ప్రజా ఆకార్షణ కలిగిన వ్యక్తుల ద్వారానే సాధ్యం అన్న అర్థాలను పరోక్షంగా కలిగిస్తోంది అంటు చాలారోజుల తరువాత తిరిగి జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ రాజకీయ చర్చలు జరుగుతున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: