సాధార‌ణంగా సినిమాల్లో మనకు చూపించే నవరసాల్లో శృంగారం కూడా ఒకటి. ఇటీవ‌ల కాలంలో రొమాన్స్ అనే అంశం సినిమాల్లో చాలా కీలకం అయిపోయింది. ఇక కొన్ని సినిమాలు అయితే క‌థ‌తో ప‌ని లేకుండా.. కేవలం రొమాన్స్ మీదే ఆధారపడి నడుస్తుంటాయి. అలాంటి సినిమాల్లో 24 కిస్సెస్ సినిమా కూడా ఒక‌టి. టైటిల్ ను బట్టే ఇది యూత్ కి సంబంధించిన రొమాంటిక్‌ కథ అనీ, ప్రేమకథా చిత్రమనే విషయం అర్థమైపోతోంది. ఈ చిత్రంలో అదిత్ అరుణ్, హెబ్బా పటేల్ జంటగా న‌టించారు. మిణుగురులు లాంటి అవార్డు విన్నింగ్ సినిమాను రూపొందించిన అయోధ్య కుమార్ కృష్ణం శెట్టి ఈ సినిమాకి దర్శక‌త్వం వ‌హంచాడు.

 

సినిమా క‌థ విష‌యానికి వస్తే.. చిల్డ్రన్స్ ఫిలిం మేకర్ అయిన ఆనంద్(అరుణ్ ఆదిత్) అమ్మాయిల పట్ల వ్యామోహం ఉన్నవాడు. అతడికి శ్రీ లక్ష్మి (హెబ్బా పటేల్) పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్త ముదిరి మరింత ముందుకు వెళ్తారు. అయితే ఆనంద్ తనని ప్రేమిస్తున్నాడని అనుకుంటుంది శ్రీలక్ష్మి కానీ ఆనంద్ యూజ్ అండ్ త్రో అనే విషయం తెలుసుకొని షాక్ అవుతుంది. తనతోనే కాకుండా ఆనంద్ కు ఇంకా చాలామంది అమ్మాయిలతో సంబంధం ఉందని తెలుసుకుని ఆనంద్ కు దూరం అవుతుంది . శ్రీలక్ష్మి దూరమయ్యాక ఆనంద్ మారాడా ?తన తప్పు తెలుసుకొని శ్రీలక్ష్మి కి దగ్గరయ్యాడా ? అన్న‌ది సినిమా క‌థ‌.

 

అయితే ఈ సినిమా క‌థ‌లో ప‌ట్టులేక‌పోయినా.. ఆదిత్, హెబ్బా పటేల్ మధ్య ఘాటు లిప్ లాక్ సన్నివేశాలే ఎక్కువ‌గా ఉంటాయి. ముఖ్యంగా 24 కిసెస్‌కు బలం, స్పెషల్ అట్రాక్షన్ హెబ్బా పటేల్ గ్లామర్. ఎలాంటి అరమరికలు లేకుండా ముద్దు సీన్లలో మునిగిపోయారు. యూత్‌ మదిలో గిలిగింతలు పెట్టే సీన్లలో బోల్డ్‌గా నటించింది. యూత్‌కు ఇదొక్కటే సినిమాలో నచ్చే అంశం. ఇక రొమాన్స్ ప్రధానాంశంగా తీర్చి దిద్దాలని అనుకున్నాడు దర్శకుడు. అయితే రొమాన్స్ ని దట్టంగా అందించాడు కానీ ఎంటర్ టైన్ మెంట్ ని ఎమోషన్ ని మాత్రం పండించలేకపోయాడు . దాంతో రొమాంటిక్ సీన్స్ తప్ప సినిమాలో ఆకట్టుకునే అంశాలు ఏవి లేకపోవడం గ‌మ‌నార్హం. ఇక సినిమా క‌థ, క‌థ‌నం ఎలా ఉన్నా.. హెబ్బా మాత్రం ముద్ద‌ల‌తో రెచ్చిపోయింద‌ని చెప్పాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: