బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క పై మానవ హక్కుల కమీషన్ లో కంప్లైంట్ నమోదయింది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే భారత క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్ళి చేసుకున్న అనుష్క, నిర్మాణ సంస్థని కూడా స్టార్ట్ చేసింది. క్లీన్న్ స్లేట్ ఫిలిమ్స్ పేరుతో స్టార్ట్ చేసిన ఈ ప్రొడక్షన్ బ్యానర్ నుండి NH19, పిల్లౌరీ, పరీ అనే చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం సినిమాలకి ధీటుగా వెబ్ సిరీస్ లకి కూడా మంచి డిమాండ్ ఉండడంతో తన మొదటి వెబ్ సిరీస్ ని నిర్మించింది.

 

పాతాల్ లోక్ అనే పేరుతో నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఇటీవలే అమెజాన్ విడుదల అయింది. అయితె ఈ వెబ్ సిరీస్ లోని కొన్ని సన్నివేశాలు అనుష్కని చిక్కుల్లో పడవేశాయి. వెబ్ సిరీస్ లకి సెన్సార్ ఉండదు కనుక, సినిమాల్లో చూపించరానటువంటి సన్నివేశాలని కూడా చూపిస్తుంటారు. అయితే ఇందులో వివాదాస్పద అంశం ఏంటంటే, వెబ్ సిరీస్ రెండవ ఎపిసోడ్ కొన్ని సీన్లు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నివసించే గోర్కా కమ్యూనిటీ మనోభావాలని కించపరిచే విధంగా ఉన్నాయని జాతీయ మానవ హక్కుల కమీషన్ లో ఫిర్యాదు చేశారు.

 

గోర్కా కమ్యూనిటీ ప్రజలని అవమానించే రకంగా సీన్లు ఉన్నాయన్న ఉద్దేశ్యంతో ఆన్ లైన్లో జాతీయ మానవ హక్కుల కమీషన్ కి ఫిర్యాదు వెళ్ళింది. అరుణా చల్ ప్రదే గోర్కా యూత్ అసోసియేషన్ ఈ వెబ్ సిరీస్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. గోర్కా కమ్యూనిటీ వారిని తక్కువ చేసి చూపినట్లుగా ఉన్న సన్నివేశాలని పూర్తిగా తీసివేయాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే ఈ వెబ్ సిరీస్ ని ప్రొడ్యూస్ చేసిన నిర్మాతపై మానవ హక్కుల కమీషన్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

 

ఈ విషయమై అనుష్క శర్మ ఏ విధంగా స్పందించనుందో చూడాలి. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ అమెజాన్ లో ట్రెండింగ్ లో ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: