మన తెలుగులో కొన్ని కొన్ని సినిమాలు అలా నిలిచిపోతు ఉంటాయి. అందులో బాలకృష్ణ సినిమాలు అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలో ఉండే కొన్ని కొన్ని సన్నివేశాలు సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులకు ఇంకా గుర్తు ఉంటాయి. వాటి గురించి కామెడిగా అనుకోవడమో లేక మరో రూపంలో అనుకోవడమో గాని ఏదోక రకంగా అయితే చర్చలు మాత్రం జరుగుతూనే ఉంటాయి అనేది వాస్తవం. ఇక బాలకృష్ణ సినిమాల్లో ఈ మధ్య కాలంలో మంచి విజయం సాధించిన సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి. 

 

క్రిష్  దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ నటనకు మంచి మార్కులు పడ్డాయి ఆయన ఆ సినిమా లోచేసిన కొన్ని సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులకు చాలా బాగా నచ్చాయి అనేది వాస్తవం. ఆయన శ్రేయా తో కలిసి చేసిన రోమాన్స్ మాత్రం ప్రేక్షకులకు పిచ్చి పిచ్చిగా నచ్చింది అనే చెప్పుకోవచ్చు. సినిమా మొదట్లో ఇద్దరి మధ్య చిన్న బెడ్ రూమ్ సీన్ ఉంటుంది. ఆ సీన్ లో బాలకృష్ణ బెడ్ మీద పడుకుని..  శ్రేయా ను దగ్గరకు తీసుకున్న సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశం ఉండేది తక్కువ సమయమే అయినా ప్రేక్షకులకు మాత్రం బాగా నచ్చింది అనే చెప్పుకోవచ్చు. 

 

ఇక ఆ సినిమా విషయానికి వస్తే బాలకృష్ణకు కమర్షియల్ గా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా అదే. ఆ సినిమా దాదాపు వంద కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది అనే చెప్పుకోవచ్చు. ఇక క్రిష్  బాలకృష్ణ సినిమాలకు అక్కడి నుంచే క్రేజ్ అనేది వచ్చింది. ఆ సినిమా తర్వాత బాలకృష్ణ చేసే సినిమాల్లో వసూళ్ళ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది అనేది వాస్తవం. ఇప్పుడు బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: