అర్జున్ రెడ్డి... మన తెలుగులో ఈ సినిమా ఒక సంచలనం అనే చెప్పుకోవాలి. ఈ సినిమా నుంచి మన తెలుగు హీరోలు దర్శకులు చాలా నే నేర్చుకున్నారు. హీరోయిన్ లు కూడా ఈ సినిమాల నుంచి కాస్త ఎక్కువగానే నేర్చుకున్నారు. సినిమా అంటే ఇలా ఉండాలి అప్పుడే యువతకు సినిమా ఎక్కుతుంది అంటూ కొందరు కామెంట్స్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి అనేది వాస్తవం. ఆ విధంగా ఈ సినిమా చాలా మందికి నచ్చింది. ముఖ్యంగా హీరో హీరోయిన్ ల నటన చూసిన ప్రేక్షకులు అయితే సినిమా కు ఎన్ని మార్కులు వేసినా తక్కువే అంటూ కామెంట్స్ చేసారు. 

 

సినిమా తర్వాత హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగింది అనే చెప్పుకోవచ్చు. అయితే హీరోయిన్ కి మాత్రం ఆ తర్వాత పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదు అనే చెప్పాలి. ఆమె ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే ఆమెకు మాత్రం అవకాశాలు రావడం చాలా కష్టంగా మారింది. ఇక అది అలా ఉంటే ఆ సినిమాలో ఉండే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు చాలా బాగా నచ్చాయి అనే చెప్పాలి. ఆ సినిమాలో ఉండే రోమాన్స్ అన్నివేశాలు చూసిన ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. వాళ్ళు ఇద్దరూ కలిసి విజయ్ ఇంట్లో చేసిన రోమాన్స్... 

 

అలాగే కాలేజి బీచ్ హౌస్ లో చేసిన రోమాన్స్ కి మంచి మార్కులే పడ్డాయి అనే చెప్పుకోవచ్చు. ఆ సినిమాలో కొన్ని కొన్ని రోమాన్స్ సన్నివేశాలు చూసి సినిమాలు చూసే వారికి చెమటలు పట్టాయి అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఆ సినిమాలో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఆ విధంగా మెప్పించాయి. ఇక విజయ్ చేస్తున్న సినిమాలు అనగానే అలాగే ఉంటాయి అనే అభిప్రాయం చాలా మందిలో అక్కడి నుంచే కలిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: