త్రివిక్రమ్ తో పనిచెయ్యడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుందని ఫీల్ అవుతారు చాలా మంది. అందుకే స్టార్ హీరోలు చాలా మంది ఈ మాటల మాంత్రికుడితో మళ్లీ మళ్లీ సినిమా చెయ్యాలనుకుంటారు. అరవిందసమేత సూపర్ హిట్ అవ్వడంతో మరోసారి తమ కాంబినేషన్ ని రిపీట్ చేద్దామనుకున్నారు ఎన్టీఆర్-త్రివిక్రమ్. అందుకే ఎన్టీఆర్ రాజమౌళితో చేస్తున్న ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్ తోనే అని అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ఈ ఏప్రిల్ లో స్టార్ట్ చేసి సినిమాని నెక్ట్స్ ఇయర్ మేలో రిలీజ్ చేస్తామని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

 

కానీ ఇప్పుడు ఏప్రిల్ లోనే కాదు.. కనుచూపు మేరలో త్రివిక్రమ్ , ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఎందుకంటే .. త్రివిక్రమ్  జులై లో ట్రిపుల్ ఆర్ రిలీజ్ అనుకుని ఏప్రిల్ లో ఎన్టీఆర్ తో సినిమా స్టార్ట్ అని చెప్పాడు. కానీ ట్రిపుల్ ఆర్ నెక్టస్ జనవరికి వెళ్లింది.ఈ లోపే లాక్ డౌన్ వచ్చింది. సో.. కనీసం ఇంకో 4..5 నెలలు ఎన్టీఆర్ రాజమౌళితోనే ఉంటాడు. ఎన్టీఆర్త్రివిక్రమ్ కాంబినేషన్లో  తెరకెక్కబోతున్న సినిమా ఎప్పుడెప్పుడా అని  ఆడియన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో .. ఆ సినిమా అంతగా డిలే అయిపోతోంది. మరి ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ అంత టైమ్ వేస్ట్ చేసుకుంటాడా..? లేక .. యంగ్ టైగర్ వచ్చేలోపు మరో సినిమా పట్టాలెక్కించేస్తాడా..?

 

ఎన్టీఆర్ ‌ఇప్పుడప్పుడే వచ్చే ఛాన్స్ లేకపోవడం, ఆల్రెడీ అలవైకుంఠపురంలో రిలీజ్ అయ్యి నాలుగునెలలవుతోంది. ఇంతకన్నా ఎక్కువ వెయిట్ చెయ్యడం ఎందుకని.. త్రివిక్రమ్.. మరో లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ సినిమా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట. ఎన్టీఆర్ వచ్చేది ఇంకా లేట్ అయ్యేలా ఉంటే .. నాగచైతన్య తో  గానీ, నానితో  గానీ ఈ సినిమాని పట్టాలెక్కించేద్దామని ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్.

 

ఎందుకంటే .. ఈ మద్య అలా హీరోల కోసం సంవత్సరాలు సంవత్సరాలు వెయిట్ చేసి చాలా మంది డైరెక్టర్లు టైమ్ వేస్ట్ చేసుకుంటున్నారు. తీరా వెయిట్ చేశాక టైమొచ్చేసరికి సారీ ..వేరే సినిమా చేద్దాం అని చెబుతున్నారు హీరోలు . అందుకే ఇలాంటి ఛాన్స్ తీసుకోవడం ఎందుకు అనుకుంటున్నాడట త్రివిక్రమ్. ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తాడో.. లేక టైమ్ వేస్ట్ చేసుకోకుండా ఈ మద్యలో ఓ మీడియం రేంజ్ సినిమా చేసేసి అప్పటికి ఎన్టీఆర్ ని లైన్లో  పెట్టేస్తాడో అని తెగ ఆలోచిస్తున్నారు అందరూ. 

మరింత సమాచారం తెలుసుకోండి: