కన్ను కొట్టి.. ముద్దుల‌తో గ‌న్ను పేల్చి ప్ర‌పంచం మొత్తాన్ని త‌న‌వైపు తిప్పుకున్నారు ప్రియా ప్రకాశ్‌ వారియ‌ర్‌. ఈ ఒక్క రొమాంటిక్ సీన్‌తో సోషల్ మీడియా క్వీన్ గా రాత్రికి రాత్రే అవతారమెత్తింది  ప్రియా ప్రకాశ్‌ వారియ‌ర్‌.. అప్పటి నుండి ప్రియా ప్రకాష్ క్రేజ్ మాములుగా పెరగలేదు. కేవలం కన్నుగీటు సుందరిగా ప్రియా ప్రకాష్ అందరి చూపుని తనవైపు తిప్పుకుంది. ఈ క్ర‌మంలోనే ప్రియా ప్ర‌కాశ్ యూత్‌ను షేక్ చేసింద‌ని చెప్పుకోవాలి. ఇక ప్రియా ప్రకాష్ క్రేజ్ తోనే `ఒరు ఆడార్‌ ల‌వ్`‌ నిర్మాతలు ఈ సినిమాని అన్ని భాషల్లోకి డబ్ చేశారు. ఈ క్ర‌మంలోనే తెలుగులో `లవర్స్ డే` టైటిల్‌తో  వాలంటైన్స్ డే సందర్భంగా 2019 విడుద‌ల చేశారు.

 

 క్రేజీ డైరెక్టర్ ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ చిత్రాన్ని తెలుగులో నిర్మాతలు ఎ. గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి సుఖీభ‌వ సినిమాస్ బ్యానర్‌పై అందిస్తున్నారు. ఈ సినిమాలో రోషన్, ప్రియా ప్రకాష్, నూరిన్ షెరిఫ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇక‌ కేవలం ప్రియా ప్రకాశ్ కన్నుకొట్టే సీన్‌లో మాత్ర‌మే కాదు.. రోషన్‌తో లిప్‌లాక్ సీన్‌లోనూ యూత్‌ను బాగా ఆక‌ర్షించింది. కాలేజ్‌లో స‌ర‌దాలు, స్నేహం, ఆక‌ర్ష‌ణ‌, ప్రేమ.... త‌దిత‌ర విష‌యాల్ని స్పృశిస్తూ సాగే చిత్ర‌మిది. ఇలాంటి చిత్రాలు తెలుగు తెర‌కు కొత్తేమీ కాదు. చిత్రం నుంచి హ్యాపీడేస్ వ‌ర‌కు ఎన్నో సినిమాల్ని గుర్తు చేస్తుంది. 

 

ఒక‌రినొక‌రు చూసుకోవ‌డాలు, ఇష్ట‌ప‌డ‌టాలు, కాలేజీలో జ‌రిగే ఫ్రెష‌ర్స్ డే, యానువ‌ల్ డే సంద‌డితో తొలి స‌గ‌భాగం ముగుస్తుంది. ద్వితీయార్ధంలో బ్రేక‌ప్‌, మ‌ళ్లీ కొత్త‌గా ప్రేమ‌లో ప‌డ‌టంవంటి స‌న్నివేశాల‌తో సాగుతుంది. అయితే ఈ సినిమాలో రొమాంటిక్ సీన్లు మాత్రం బాగా హైలైట్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా రోషన్ మరియు ప్రియా ల మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. రెండో హీరోయిన్ పాత్రలో కనిపించిన నూరిన్ షెరీఫ్ తన అందచందాలతో నే కాక నటనతో కూడా అలరిస్తుంది. క్లారిటీగా చెప్పాలంటే.. సినిమా హిట్ అవ్వ‌క‌పోయినా.. యూత్‌ఫుల్ రొమాంటిక్ మావీగా నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: