బాజీ రావు మస్తాని... ఇండియన్ సినిమాను ఒక ఊపు ఊపిన సినిమా ఇది. ఈ సినిమాలో రణవీర్ సింగ్ నటన దీపిక ప్రియాంక ల నటన గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. ప్రతీ సీన్ లో కూడా వాళ్ళు జీవించారు సినిమాలో నటించిన ప్రతీ నటి కూడా చాలా బాగా చేసారు. నటులు అందరూ కూడా తమ స్థాయికి మించి నటించడం విశేషం. ఇక ఈ సినిమాలో ఉండే కొన్ని కొన్ని సన్నివేశాలు అయితే ప్రేక్షకులకు చాలా బాగా నచ్చాయి. అందులో ప్రధానంగా చెప్పుకునే సన్నివేశాలు ప్రియాంక రణవీర్ సింగ్ మధ్య ఉన్న కొన్ని సన్నివేశాలు.

 

రణవీర్ సింగ్ అయితే ప్రియాంక చోప్రా తో ఒక రేంజ్ లో రోమాన్స్ చేసాడు అనేది వాస్తవం. యుద్ధం ముగిసి ఇంటికి వచ్చిన తర్వాత ఆమె తో బెడ్ రూమ్ లో ఒక సన్నివేశంలో జీవించారు ఇద్దరు అని కొందరు కామెంట్స్ చేసారు కూడా. ఇక దీపిక తో కూడా రణవీర్ సింగ్ చాలా బాగా నటించి మెప్పించాడు. ఆమె తో యుద్ధం తర్వాత అతను చేసిన నటనకు మంచి మార్కులు పడ్డాయి అని చెప్పుకోవాలి. సినిమాను ఏ విధంగా చూపించాలో ఆ విధంగా దర్శకుడు చూపిస్తే నటుల పరంగా వాళ్ళు ఏది చెయ్యాలో చేసారు. 

 

ప్రియాంక దీపిక ఇద్దరూ కూడా రణవీర్ కి భార్యలు గా నటించారు. ప్రతీ సీన్ కూడా ప్రేక్షకుల కళ్ళ ముందు అలా నిలిచిపోయింది అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ప్రియాంక ఎక్కువగా బాలీవుడ్ లో కాకుండా హాలీవుడ్ లో చేస్తుంది. హాలీవుడ్ సినిమాల్లో ఆమెకు ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. రణవీర్ దీపికసినిమా తర్వాత వివాహం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాతే వీళ్ళు పెళ్లి చేసుకుంటారు అనే వార్తలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: