కొన్ని సినిమాలు కాంబినేషన్ తోనే ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాయి. ఎప్పుడెప్పుడు చూద్దామా.. అని ప్రేక్షకులంతా ఎదురు చూసేలా భారీ బజ్ క్రియేట్ చేస్తాయి. అలాంటి కాంబినేషన్ నే ప్లాన్ చేస్తున్నాడు ప్రభాస్. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినీ జనాలు కూడా ఆతృతగా ఎదురు చూసేలా సూపర్ కాంబోతో రాబోతున్నాడు బాహుబలి. 

 

బాహుబలి తర్వాత ప్రభాస్ టార్గెట్స్ మారిపోయాయి. సినిమా సినిమాకు మార్కెట్ పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇక డార్లింగ్ టార్గెట్ కు తగ్గట్టుగానే, నాగ్ అశ్విన్ కూడా భారీ ప్రణాళికలు రచిస్తున్నాడు. ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ మూవీని లార్జ్ స్కేల్ లో ప్లాన్ చేస్తున్నాడు నాగ్ అశ్విన్. భారీ స్టార్ క్యాస్టింగ్ తో ఈ మూవీని ఫుల్ రిచ్ గా డిజైన్ చేస్తున్నాడు. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసేందుకు హిందీ నుంచి టాప్ స్టార్స్ ను తీసుకుంటున్నాడు. ప్రభాస్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెని తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. 

 

మహానటితో సౌత్ ఇండియాను మెప్పించిన నాగ అశ్విన్, ప్రభాస్ మూవీతో నార్త్ ని టార్గెట్ చేశాడు. డార్లింగ్ మార్కెట్ కు తగ్గట్టుగా పాన్ ఇండియన్ మూవీ రెడీ చేస్తున్నాడు. రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ తీయబోతున్నాడు నాగీ. ఇక ఎనౌన్స్ మెంట్ తోనే భారీ బజ్ క్రియేట్ చేసుకున్న ఈ  ప్రాజెక్ట్ ను మరో రేంజ్ కు తీసుకెళ్లేందుకు దీపికా పదుకొణేని కాంటాక్ట్ చేస్తున్నారనే టాక్ వస్తోంది. 

 

దీపికా పదుకొణే స్టార్ హీరోల సపోర్ట్ లేకుండానే బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ తోనూ కోట్లు కలెక్ట్ చేస్తోంది. ఇక ప్రభాస్ కు ఇలాంటి స్టార్ తోడైతే సినిమా మరో లెవల్ కు వెళ్తుందనుకున్నారట దర్శకనిర్మాతలు. అయితే దీపిక పదుకొణే స్టోరీ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. హీరోయిన్ రోల్ కు ఇంపార్టెన్స్ ఉంటేనే సైన్ చేస్తుంది. లేకపోతే నో చెబుతుంది. మరి ఇలా ఉండే హీరోయిన్ ను టాలీవుడ్ తీసుకురావడానికి నాగీ ఏం చేస్తాడో అనేది చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: