సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వందకు పైగా సినిమాలు తీసారు మూవీ మొఘల్ డి.రామానాయుడు. ఇన్ని సినిమాల్లో ఎందరో హీరోలకు, హీరోయిన్లకు దర్శకులకు లైఫ్ ఇచ్చారు. అలా సురేశ్ మూవీస్ ద్వారా బ్రేక్ తెచ్చుకున్న దర్శకుల్లో ముప్పలనేని శివ, సోలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో శ్రీకాంత్,  హీరోయిన్ గా పరిచయమై రాణించిన హీరోయిన్లు సంఘవి, మోనికా బేడీ. సురేశ్ ప్రొడక్షన్స్ లోనే ఈ నలుగురూ కలిసి చేసిన సినిమానే ‘తాజ్ మహల్’. ఈ సినిమా విడుదలై నేటికి 25 ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

ఆ సమయంలో రామానాయుడు ఈ సినిమాతో ప్రయోగమే చేశారు. 1995 మే 24న విడుదలైంది ఈ  సినిమా. విచిత్రమేమిటంటే హీరో, హీరోయిన్లు, దర్శకుడు, పాటల రచయిత, సంగీత దర్శకురాలు.. వీళ్లందరికీ కలిపి ఒకేసారి బ్రేక్ ఇచ్చింది ‘తాజ్ మహల్’ మూవీ. ఇంతమంది కొత్త వాళ్లతో చేసినా కథ, దర్శకుడిపై నమ్మకం ఉంచి ఈ సినిమా తీశారు. విడుదలైన ప్రతి ఏరియాలో సూపర్ హిట్ అయింది. ముప్పలనేని శివకు దర్శకుడిగా ఇది రెండో సినిమా. ముక్కోణపు ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కింది. శ్రీకాంత్ సోలో హీరోగా చేసిన ఈ మొదటి సినిమానే శతదినోత్సవ సినిమా అయింది. సంఘవి టాప్ హీరోయిన్ అయిపోయింది.

IHG

 

ఎంఎం శ్రీలేఖ సంగీతంలోని పాటలన్నీ సూపర్ హిట్టయ్యాయి. ఈ సినిమాతోనే పాటల రచయిత చంద్రబోస్ వెండితెరకు పరిచయమయ్యారు. జంధ్యాల మాటలు, శివ రాసుకున్న కథ, స్క్రీన్ ప్లే సినిమాకు మేజర్ ప్లస్ అయ్యాయి. రామానాయుడు ఒకరిపై నమ్మకం పెడితే ఇక వెనుదిరిగి చూడరు. ప్రేమఖైదీతో ఈవీవీకి కూడా బ్రేక్ ఇచ్చారు. ఏవీఎస్ పై నమ్మకముంచి దర్శకుడిని చేశారు. ఇలా ఆయన చేసిన ప్రయోగాలెన్నో. ‘తాజ్ మహల్’ ఆయన కెరీర్లో ఓ వండర్ మూవీ అని చెప్పాలి.

Image

 

మరింత సమాచారం తెలుసుకోండి: