లాక్ డౌన్ నాలుగవ విడత ఇపుడు అమల్లో ఉంది. లాక్ డౌన్ మరి కొద్ది రోజుల్లో ఎత్తేస్తారో లేదో చూడాలి. ఒక వేళ కొనసాగినా కూడా మరిన్ని సడలింపులు ఉంటాయి. ఆ విధంగా చూసుకుంటే సినిమా హాళ్ళలో బొమ్మ పడే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఇక గత నాలుగు నెలలుగా సినిమాలు రిలీజ్ కావడంలేదు.

 

ఆగస్ట్ నెల మొదటి వారలో సినిమాలు తెరవడానికి చాన్స్ ఇస్తారని అంటున్నారు. కొన్ని నిబంధనలు రూపొందించి జాగ్రత్తలు పెట్టి మరీ థియేటర్ల తాళాలు తీస్తారని చెబుతున్నారు. అయితే సినిమా హాళ్ళు తీస్తే ఏ ఏ సినిమాలు వస్తాయి. అసలు జనాలు సినిమాలకు వస్తారా ఇలాంటి డౌట్లు చాలానే ఉన్నాయి.

 

ఎందుకంటే కరోనా మహమ్మరి బయట పొంచి ఉంది. సోషల్ డిస్టన్స్ అన్నది చూస్తే సినిమా హాళ్ళల్లో  పెద్దగా వర్కౌట్ అవుతుందో లేదో చెప్పలేని స్థితి. ఈ నేపధ్యంలో సినిమా హాళ్ళకు మళ్ళీ మునుపటిలా క్రౌడ్ కనిపించాలంటే పెద్ద హీరోల సినిమాలే మొదట తీసుకురావాల్సివుంటుందని అంటున్నారు. ఈ లెక్కన చూసుకుంటే ఇప్పటికి షూటింగ్ తొంబై శాతం పూర్తి చేసుకుని ఉన్న  పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్  మాత్రమే రెడీగా కనిపిస్తోంది.

 

ఆ మిగిలిన పది శాతం ఫినిష్ చేయడం పెద్ద కష్టం కాదు, ఇక షూటింగులకు ఎటూ అనుమతి జూన్ నెలలో ఇస్తారు, దాంతో లాక్ డౌన్ తరువాత మొదట పూర్తి చేసుకునే సినిమా వకీల్ సాబ్ అవుతుంది. ఆ తరువాత ఆ మూవీని ఆగస్ట్ లో థియేటర్లు ప్రారంభించాక విడుదల చేస్తారట.

 

ఇలా పెద్ద హీరోతో శుభారంభం పలికాక మిగిలిన హీరోల సినిమాలు కూడా నెమ్మదిగా వస్తాయని  అంటున్నారు. మొత్తానికి పవన్ వకీల్ సాబ్ సినిమా థియేటర్ల ఫ్యూచర్ మీద తనదైన తీర్పు చెప్పబోతారన్న మాట. చూడాలి మరి 

మరింత సమాచారం తెలుసుకోండి: