తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు సంపాదించాడు దగ్గుబాటి వారసుడు రానా. ఎలాంటి  పాత్రల్లో నటించినా తన నటనతో విశ్వరూపం చూపించి పాత్రకు ప్రాణం పోసే విధంగా నటించి ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాడు. అంతే కాకుండా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి.. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో మొన్నటి వరకు బాచిలర్ గా ఉన్న హీరోలందరూ ప్రస్తుతం పెళ్లి వైపు దృష్టి పెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే యువ హీరోలు అయిన అఖిల్  పెళ్లి చేసుకోగా.. నితిన్  నిశ్చితార్థం పూర్తి చేసుకొని పెళ్ళికి సిద్ధంగా ఉన్నాడు. 

 

 ఇప్పుడు రానా కూడా పెళ్లికి సిద్ధం అయిపోయిన విషయం తెలుసిందే. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న రానా  ప్రస్తుతం పెళ్లి చేసుకోబోతున్నాడు. అంతవరకు ప్రభాస్ కి తోడుగా ఉన్నాడని అనుకున్నప్పటికీ ఇప్పుడు ప్రభాస్ కంటే ముందు రానా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు . ఇటీవలె మహిక  బజాజ్.. రానా  కుటుంబాల్లో ఎంగేజ్మెంట్ వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రానా . తాను  పెళ్లి చేసుకోవడానికి సమయం వచ్చింది అంటూ భావిస్తున్నానని తెలిపాడు రానా. 

 


 అయితే ప్రస్తుతం కరోనా  వైరస్ వ్యాప్తి ఉన్నందున ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను అనుసరించి... తన వివాహాన్ని గ్రాండ్ గా  చేసుకోవాలా... కేవలం బంధుమిత్రుల మధ్య చేసుకోవాలా అనే విషయాన్ని నిర్ణయించుకున్నామని వెల్లడించారు రానా . ఈ సందర్భంగా తనకు కాబోయే భార్య మహిక  బజాజ్ తో ఉన్న పరిచయాన్ని కూడా చెప్పుకొచ్చాడు..మహిక  బజాజ్ గురించి తనకు పూర్తిగా తెలుసునని.. మహిక ను  కలిసిన రోజు తనతో జీవితం ముడిపడి ఉన్నట్లుగా తాను భావించినట్లు రానా  వెల్లడించారు. ప్రొపోజ్ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత మహికకు ఫోన్ చేసి చెప్పానని నా వైపు నుంచి ఎంతో స్పష్టంగా ఉన్న తర్వాత ఆమెతో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు రానా..

మరింత సమాచారం తెలుసుకోండి: