ఈ సాంగ్ వయసు మూడు దశాబ్దాల పై మాటే. ఈ సాంగ్ అప్పట్లో మారుమోగిపోయింది. యూత్ ని వెర్రి కేకలు పెట్టించింది. చిరంజీవి, విజయశాంతి నటించిన గ్యాంగ్ లీడర్ సెన్షేషనల్ హిట్. ఇక అందులోని సాంగ్స్ అన్నీ బాలీవుడ్ మ్యూజిక్ మాంత్రికుడు బప్పీలహరి స్వర రచనలో టాప్ రేంజిలో మోత మోగించాయి. ఆ సినిమా ఘనవిజయంలో పాటలు కూడా అతి ముఖ్య‌మైన పాత్ర పోషించాయి.

 

ఇవన్నీ ఇలా ఉంటే చిరంజీవి విజయశాంతి కాంబో ఆ తరువాత ఒకటి రెండు సినిమాలకే బ్రేక్ ఇచ్చసింది. దానికి కారణం ఇద్దరికీ సూపర్ స్టార్ డం ఉండడం, ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా ఉండడంతో కలసి మూవీస్ చేయలేకపోయారు. అంటే ఓ విధంగా ముప్పయ్యేళ్ళుగా చిరంజీవి, విజయశాంతి స్క్రీన్ షేర్ చేసుకోవడంలేదు.

 

ఇక ఆ తరువాత కాలంలో చిరంజీవి, విజయశాంతి రాజకీయాల్లోకి రావడంతో రెండు పార్టీల మధ్య మాటల యుధ్ధం మొదలైంది. విజయశాంతి చిరంజీవిని ఘాటుగానే విమర్శించేవారు.  ఇక చిరంజీవి తన బాధను అంతా దాచుకుని తాజాగా సరిలేరు నీకెవ్వరు ఆడియో ఫంక్షన్లో దాన్ని వెళ్ళగక్కారు. అదే విధంగా తామిద్దరమూ ఒక్కటేనని చెప్పారు కూడా.

 

ఇది జరిగాక ఇపుడు ఈ ఇద్దరి జంట వెండితెర మీద మళ్ళీ కనిపిస్తుందా అన్న ఆలోచనలు కూడా అందరిలోనూ కలిగాయి. దానికి కార్యరూపం అన్నట్లుగా  మళయాళంలో హిట్ అయిన లూసిఫర్ మూవీ రీమేక్ లో విజయశాంతి చిరంజీవితో సిల్వర్ స్క్రీన్ని షేర్ చేసుకోబోతోందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీని సుజిత్ డైరెక్ట్ చేయనున్నాడు. ఆయన ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం విజయశాంతి పేరు పరిశీలిస్తున్నాడని చెబుతున్నారు. 

 

అదే నిజం అయితే మళ్ళీ చిరంజీవి, విజయశాంతి జంట కనుల విందు చేయనుందన్న మాట. సండే అననురా, మండే అననురా అని గ్యాంగ్ లీడర్ టైపులో ఇద్దరూ స్టెప్పులేయకపోయినా తన నటనతో శభాష్ అనిపించడం ఖాయమని అంటున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: