టాలీవుడ్ లో మెగా స్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ అందరికి తెలిసిందే. అయితే కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న చిరంజీవి ఖైదీ సినిమా తో మెగా స్టార్ గా నిలదొక్కుకున్నాడు. ఇక ఆ తరవాత నుండి వరుస విజయాలతో అశేష అభిమానులను సంపాదించుకున్నారు. టాలీవుడ్ లో అగ్ర హీరోగా ఎదిగిన చిరంజీవి సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ పలు సేవా కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ నేపధ్యంలో చిరంజీవి గారు తన కెరీర్, పెళ్లి ఇలా పలు అంశాలను అభిమానులతో పంచుకున్నారు.

 

టాలీవుడ్ లో చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. శ్రీకాంత్, రవితేజ మొదలు చాలా మంది హీరోలు చిరంజీవికి పెద్ద ఫ్యాన్స్ అన్న సంగతి తెలిసిందే. చిరంజీవి పెళ్లి గురించి తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. సినీ పరిశ్రమ అంటే రంగుల ప్రపంచం అనుకునే రోజుల్లో చిరంజీవి హీరోగా మంచి ఫాం లో ఉన్నాడు. ఆ సమయంలోనే చిరుకి  వేరే ఇతరత్రా ఆకర్షణలకు  అలవాటు పడతారేమోనని చిరంజీవి తండ్రి వెంకట్రామయ్య గారు చిరంజీవికి పెళ్లి చేయాలని నిర్ణయించుకుని అల్లు రామలింగయ్య గారి కూతురు సురేఖతో చిరంజీవికి వివాహం జరిపించారు.

 

అయితే అప్పటికి తాతయ్య ప్రేమ లీలలు అనే సినిమా చేస్తున్న చిరంజీవి డేట్స్ ఖాళి లేక పెళ్లి వాయిదా వేద్దామనుకున్నారట. అయితే ఆ సినిమా దర్శకుడు చిరంజీవి కోసం షూటింగ్ ని నిలిపివేసారని చిరంజీవి తెలిపారు. అయితే ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే చిరంజీవి పెళ్లి పీటలు ఎక్కేసరికి ఆయన షర్టు చిరిగిందట. దానికి సురేఖ వేరే షర్టు వేసుకోవచ్చుగా అంటే చిరు షర్టు చిరిగినంత మాత్రాన తాళి కట్టలేనా అంటూ మూడు ముళ్ళు వేశానని చిరు పెళ్లి నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: