పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు రెండున్నర సంవత్సరాల గ్యాప్ తర్వాత ‘వకీల్ సాబ్’ సినిమాతో ఇండస్ట్రీ లోకి రీఎంట్రీ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు సగానికిపైగా పూర్తయింది. బాలీవుడ్ ‘పింక్’ సినిమా రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్న తరుణంలో పవన్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అంతా బాగానే ఉండి కరోనా వైరస్ రాకుండా ఉండి ఉంటే మే 15 సినిమా రిలీజ్ అయి ఉండేది. అయితే ఈ లోపు వైరస్ రావటంతో లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగ్ లు మొత్తం ఆగిపోవటంతో ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది.

 

అయితే ఇటీవల సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరపడంతో అంతా ఓకే అని జూన్ మాసం నుండి ఈ సినిమా షూటింగ్ లకు పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు బలంగా వినబడుతున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ మిగతా బ్యాలెన్స్ షూటింగ్ డేట్ కోసం నిర్మాత దిల్ రాజు వెయిట్ చేస్తున్నారు అంట. జూన్ నెలలో సినిమాను పూర్తి చేసేందుకు పూర్తి డేట్స్ ఇవ్వాలని షూటింగ్ కి సహకరించాలని కోరారట. దీనికి పవన్ కళ్యాణ్ ఓకే చెప్పినట్లు సమాచారం.

 

సినిమా అయిన వెంటనే డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమాలు చేయనున్నారు. కాగా చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రాబోతున్న తరుణంలో మెగా అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. అంతేకాకుండా ఎన్నడూ లేని విధంగా వరుసపెట్టి సినిమాలు పవన్ కళ్యాణ్ ఒప్పుకోవటం అభిమానులకు మంచి కిక్ ఇస్తున్నట్లు ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: