సినిమాల్లో విలన్ వేషాలు వేసే సోనూసూద్.. ఇపుడు నిజ జీవితంలో రియల్ హీరో అనిపించుకున్నాడు. కేంద్ర మంత్రి సైతం సోనూసూద్ సేవలను ప్రశంసించారు. దేశ వ్యాప్తంగా మార్చి 22 నుంచి లాక్‌ డౌన్‌ కొనసాగుతండగా వలస కార్మికుల కష్టాలు వర్ణనాతీతం. సొంతూళ్లకు వెళ్లేందుకు అనేక కష్టాలు పడుతున్నారు. జాతీయ రహదారులపై ఎక్కడా చూసిని వేలాది మంది ఇళ్లకు చేరేందుకు పడుతున్న కష్టాలే కనిపిస్తాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వలస కార్మికులను ఇళ్లకు చేర్చేందుకు సోనూసూద్‌ తన ఉదారతను చాటుకుంటున్న విషయం తెలిసిందే.

 

ఉత్తర్‌ప్రదేశ్‌, బీహార్ రాష్ట్రాల‌కు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటుచేసి వారికి అండ‌గా నిల‌బ‌డుతున్నారు. ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి సొంతూళ్లకు చేర్చాడు. తిండి తిప్పలు లేక, కనీస ఛార్జీలు లేక పుట్టిన ఊరికెళ్లేందుకు కాలినడకన బయలుదేరిన వలస కూలీల వద్దకు వెళ్లి ధైర్యం చెప్పాడు. ఘర్ బేజో పేరుతో నీతి గోయల్‌తో కలిసి అప్పటికప్పుడు వందలాది బస్సులు సిద్ధం చేయించాడు. ఇప్పటివరకూ కనీసం 12 వేల మంది వలస కార్మికులను వారి వారి స్వగ్రామాలకు పంపించాడు. నిత్యావసరాలు, మంచినీళ్లు, ఆహారం అందించాడు. ఉపాధి కోసం తిరిగి రావాలని ధైర్యం కూడా చెప్పాడు.

 

సోనూసూద్ సాయంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. రీల్ లైఫ్‌లో విలన్‌ గా నటించే సోనూ సూద్ రియల్ లైఫ్‌ లో హీరోగా మారిపోయాడంటూ నెటిజన్లు కీర్తిస్తున్నారు. అతను చేస్తున్న సహాయ కార్యక్రమాలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రశంసల వర్షం కురిపించారు. 'నటుడిగా మీరు ఎంతో ఎత్తుకు ఎదిగారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మీరు అందజేస్తున్న సాయం  చూసి దేశం గర్విస్తోంది. వృత్తిపరంగా  మీతో రెండు దశాబ్దాల పరిచయం. మీ సేవలు వెలకట్టలేనివి' అని స్మృతి ఇరానీ ట్వీట్ చేస్తూ.. సోనూ సూద్‌ ను పొగడ్తల్లో ముంచెత్తారు. ఇదిలా ఉండగా సోనూ సూద్‌ తన సహాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆరోగ్యశాఖలో పనిచేసే సిబ్బంది వినియోగించుకొనేందుకు ముంబైలోని తన హోటల్‌ను తెరిచి ఉంచడమే కాకుండా.. పంజాబ్‌లో వైద్యులకు 1500 పీపీఈ కిట్లు అందజేసి రియల్‌ హీరోగా నిలిచారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: