సినిమాకు హీరో ఎంత ముఖ్యమో హీరోకు జంటగా నటించే హీరోయిన్ అంతే ముఖ్యం. ప్రేక్షకులకు సినిమా నచ్చాలంటే వారిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పండాల్సిందే. అందుకే దర్శకులు హీరోతో సినిమా అనుకున్న తర్వాత హీరోయిన్ కోసం పెద్ద తపస్సే చేస్తారు. కొందరు దర్శకులు వారి సెంటిమెంట్ ప్రకారం హీరోయిన్లను తమ సినిమాల్లో రిపీట్ చేస్తూ ఉంటారు. కొంతమంది హీరోయిన్లకు కొందరు దర్శకుల మీద నమ్మకంతో సినిమాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా, దర్శకుడు సంపత్ నంది ఉన్నారు.

IHG

 

సంపత్ నంది దర్శకత్వంలో తమన్నా ఇప్పటి వరకూ రెండు సినిమాలు చేసింది. తొలి సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘రచ్చ’లో నటించింది. ఆ సినిమా హిట్ కావడంతో సంపత్ నంది చేసిన తర్వాతి ప్రాజెక్టుల్లో మరో సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఆ సినిమానే బెంగాల్ టైగర్. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు. ఒక హీరోయిన్ గా తమన్నానే సుకున్నాడు సంపత్ నంది. క్యారెక్టర్ ని అర్ధం చేసుకోవడమే కాకుండా తన కథలకు తమన్నా కరెక్ట్ గా సూట్ అవుతుందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు సంపత్ నంది.

IHG

 

అందుకే తన సినిమాలకు ఫస్ట్ చాయిస్ తమన్నానే అంటాడు. ప్రస్తుతం తమన్నా తెరకెక్కిస్తున్న ‘సీటీమార్’ సినిమాలో కూడా తమన్నానే తీసుకున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ హీరో. తమన్నా కబడ్డీ కోచ్ పాత్రలో నటిస్తోంది. తన క్యారెక్టర్ ను తెలంగాణ స్లాంగ్ తో మాట్లాడనుంది. ఈ సినిమాలో తమన్నా క్యారెక్టర్ కు చాలా ఇంపార్టెన్స్ ఉందని చెప్తున్నాడు సంపత్ నంది. సంపత్ కథల్లో కథానాయిక పాత్రలకు కూడా సమ ప్రాధాన్యం ఉంటుందని తమన్నా కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: