ఒక మోస్ట్ అడోరబుల్ కపుల్ నాగచైతన్య సమంత. వీళ్లిద్దరూ కలిసి కనిపిస్తే చాలు సోషల్ మీడియాలో లవ్ వైబ్స్ పాసవుతాయి. క్రేజీ కామెంట్స్ తో చైతూ, సామ్ పోస్టులు ట్రెండింగ్ లోకి వెళ్తాయి. రానా రోకా ఫంక్షన్ లో ఈ కపుల్ చేసిన హంగామా ఇలాగే నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

 

నాగచైతన్య ఎంత కామ్ కనిపిస్తాడో..సమంత అంత హైపర్ గా ఉంటుంది. స్క్రీన్ పై ఎంత ఎనర్జిటిక్ గా ఉంటుందో.. ఆఫ్ ది స్క్రీన్ కూడా అంత జోవియల్ గా కనిపిస్తుంది సామ్. అలాగే సొంత విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. లేటెస్ట్ గా నాగచైతన్య గ్లామర్ గురించి ఇలాగే ఓ పోస్ట్ పెట్టింది సమంత. దానికి నాగచైతన్య ఇచ్చిన కౌంటర్ ట్రెండింగ్ టాపిక్ గా మారింది. 

 

రీసెంట్ గా రానా- మిహికాల రోకా ఫంక్షన్ జరిగింది. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో జరిగిన ఈ ఫంక్షన్ లో నాగచైతన్య, సమంత జంట కూడా సందడి చేసింది. ఈ ఫంక్షన్ ఫోటోస్ తో ఇన్ స్టాలో సమంత కొన్ని పోస్టులు పెట్టింది. వాళ్లలో నాగచైతన్య గ్లామర్ గురించి సామ్ పెట్టిన పోస్ట్, దానిపై చై ఇచ్చిన రిప్లై నెటిజన్లకు ఉపాధి కల్పిస్తోంది. 

 

అమ్మ, అత్తయ్య, పిన్ని, ఫ్రెండ్స్ అందరికీ పంపిన తర్వాత ఫైనల్ గా ఇన్ స్టాగ్రామ్ లోనూ పోస్ట్ చేస్తున్నాను. నా భర్త చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా అనే కామెంట్ తో చైతన్య ఫోటోను పోస్ట్ చేసింది సమంత. దీనికి చైతన్య పెయిడ్ పార్టనర్ షిప్ లా ఉంది అని పంచ్ వేశాడు. ఈ పంచ్ కు సమంత కూడా ఓ కౌంటర్ ఇచ్చింది. ఓ నువ్వు ఇన్ స్టాగ్రామ్ చూశావా అంటూ చై సోషల్ మీడియాలో ఇన్ యాక్టివిటీపై కౌంటర్ వేసింది సామ్. ఇక ఈ కౌంటర్లు చూసి భార్యభర్తలంటే ఇలా ఉండాలంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: