ఇప్పుడు మన తెలుగులో మంచి క్రేజ్ ఉన్న హీరో నానీ. యువ హీరోల్లో అతనికి అన్ని వర్గాల అభిమానులు ఫ్యాన్స్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన సినిమాలు విడుదల అవుతున్నాయి అనగానే జనాలకు ముందు నుంచి కూడా ఒక క్రేజ్ అనేది ఉంటుంది అనే మాట వాస్తవం. నానీ ఇప్పుడు ఒక రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తి అయిన తర్వాత మల్టీ స్టారర్ సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. 2015 - 2017 మ‌ధ్య కాలంలో టాలీవుడ్ లో ఏ హీరోకు లేని విధంగా నాని ఏకంగా ఎనిమిది హిట్లు కొట్టాడు. ఆ టైంలో నాని సినిమా వ‌స్తుందంటే చాలు యువ‌త‌.. మ‌హిళు తొలి రోజు తొలి షో చూసేందుకు ఎగ‌బ‌డి పోతారు.

 

ఇక ఇదే సమయంలో నానీ కి ఒక ఆఫర్ వచ్చింది అనే ప్రచారం ఈ మధ్య జరిగింది. త్రివిక్రమ్ సినిమాలో నానీ ఉండే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అన్నాయి.  ఆర్ ఆర్ ఆర్ సినిమా తో ఎన్టీఆర్ బిజీ గా ఉన్నాడని నానీ కి ఇప్పటికే త్రివిక్రమ్ నుంచి పిలుపు వెళ్ళింది అని నానీ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు అని అన్నారు. అయితే ఇది నిజమో కాదో గాని ఇప్పుడు ఒక వార్త అయితే వచ్చింది. 

 

నానీ పరుశురాం తో ఉండే సినిమాలో ఉన్నాడని నానీ మహేష్ బాబు కి తమ్ముడిగా ఆ సినిమాలో నటిస్తాడని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ సినిమా సూప‌ర్ స్టార్ మహేష్ బాబు మానసిక రోగిగా ఆ సినిమాలో కనపడతాడు అని... నానీ మహేష్ బాబుని కాపాడే ఒక తమ్ముడిగా కొన్ని సన్నివేశాల్లో కనపడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. నిజమా కాదా అనేది ఇంకా తెలియదు గాని త్వరలోనే స్పష్టత రానుంది. ఒక వేళ అదే నిజ‌మైతే మ‌హేష్ ఫ్యాన్స్ కు మామూలు సంబ‌రం కాదు..?

మరింత సమాచారం తెలుసుకోండి: