తెలుగులోని యాక్షన్ హీరోల్లో గోపీచంద్ పేరు ముందువరుసలో కనిపిస్తుంది. ఆయన సినిమాల్లో ఎమోషన్ .. రొమాన్స్ .. కామెడీ ఇలా అన్ని అంశాలు ఉన్నప్పటికీ యాక్షన్ పాళ్లే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. యజ్ఞం, ఆంధ్రుడు, గోలీమార్, లక్ష్యం, రణం, లౌక్యం చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కొంతకాలంగా గోపీచంద్ సక్సెస్ లేక బాగా వెనకబడిపోయారు. గత కొన్నేళ్ళుగా సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆయన మార్కెట్ బాగా తగ్గిపోయింది. గడిచిన మూడేళ్లలో వరుసగా ఐదు డిజాస్టర్లను గోపీచంద్ అందించారు. ‘జిల్’ సినిమా యావరేజ్ గా నిలిచినా తర్వాత వచ్చిన సినిమాలు పరాజయాన్ని చవిచూశాయి. సౌఖ్యం తో మొదలైన పరాజయాలు ‘పంతం’ వరకు కొనసాగాయి. స్క్రిప్ట్ సెలెక్షన్స్ లో చేసిన పొరపాటు వల్ల ఆయన విజయాలకు దూరమయ్యాడని చెప్పవచ్చు. 

 

ప్రస్తుతం ఫ్లాప్స్ తో స‌త‌మ‌వుతున్న సంపత్‌ నంది దర్శకత్వంలో స్పోర్ట్స్‌ బేస్డ్‌ సినిమా ‘సీటీమార్‌’ వస్తోన్న సంగతి తెలిసిందే. ఇంతకముందు వీరి కాంబోలో వచ్చిన 'గౌతమ్ నంద' సినిమా పరాజయాన్ని చవి చూసింది. 'సీటీమార్‌' గోపీచంద్ 28వ సినిమా. 'యూ టర్న్'లాంటి సూపర్ హిట్ సినిమా అందించిన చిట్టూరి శ్రీనివాసరావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కి కోచ్‌ గా చేస్తున్నాడు. తమన్నా 'జ్వాలా రెడ్డి' అనే తెలంగాణా కబడ్డీ టీమ్ కోచ్ గా చేస్తున్నారు. ఆమ్ రోల్ కూడా ఈ చిత్రంలో సీరియస్ నెస్ తో కూడుకున్న ఇంటెన్సిటీతో ఉంటుందట. 

 

ఇటీవల ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నానని.. అది కొంచెం కష్టంగా అనిపించినా డైరెక్టర్ సహకారంతో మాట్లాడగలిగానని చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు కనిపించని డిఫరెంట్ రోల్ తో ముందుకొస్తున్న తమన్నాసినిమా తనని మళ్లీ ట్రాక్ లోకి తెస్తుంది అని నమ్మకంతో ఉంది. అంతేకాకుండా తమన్నా – గోపీచంద్ మధ్య గేమ్ కి సంబంధించి మంచి ఇద్దరి మధ్య వార్ నడుస్తోందని.. ఈ మధ్యలోనే వీరి లవ్ ట్రాక్ కూడా చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి మంచి హిట్ ఇవ్వాలని సంపత్ నంది బాగా పట్టుదలగా ఉన్నాడు. మరి ఈ సారి ఈ కాంబినేషన్ సక్సెస్ అవుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: