డైరెక్టర్ శేఖర్ కమ్ముల మనసులను హత్తుకునే ఫ్యామిలీ డ్రామా సినిమాలను చాలా చక్కగా వెండితెరపై చూపించి కోట్ల మంది సినీ అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు. వరుణ్ సందేశ్ తమన్నా హీరోహీరోయిన్లుగా నటించిన హ్యాపీ డేస్ అప్పట్లో భారీ హిట్ అయ్యింది. ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది బీటెక్ లో చేరాలంటే నమ్మండి. యువతపై బాగా ప్రభావం చూపిన ఈ సినిమా శేఖర్ కమ్ములకు ఎనలేని ప్రఖ్యాతిని తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమాలో శ్రేయ మేడం పాత్ర లో కమలిని ముఖర్జీని నటింప చేశాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. రాజేష్ పాత్రలో నటించిన నిఖిల్ సిద్ధార్థ శ్రేయ మేడం పై మనసు పారేసుకుని తనవెంటే తిరుగుతూ ఉంటాడు. ఈ సన్నివేశాలు బాగా పండాయి అని చెప్పుకోవచ్చు. అలాగే కమలినీ ముఖర్జీ ఈ పాత్రలో చాలా అందంగా కనిపించింది. 

 


హ్యాపీ డేస్ సినిమా లో మాత్రమే కాదు శేఖర్ కమ్ముల తీసిన పలు సినిమాల్లో కమలినీ ముఖర్జీ హీరోయిన్ గా నటించింది. కలకత్తా లో జన్మించిన ఈమె ఇంగ్లీష్ లిటరేచర్ లో డిగ్రీ పొందింది. కవిత్వం రాయడం అంటే మహా ఇష్టం. Thoughts, Confusion and Solitude అనే కవితలను poetry.com లో ఆమె ప్రచురించగా... తాను రాసిన ఒక కవిత అంతర్జాతీయ కవితల పోటీలో ఎంపిక కాగా ఆమె వాషింగ్టన్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నది. అందులో ఆహ్వానం లభించడం సాధారణ విషయం కాదు.  అయితే ఆమెను ఒకానొక రోజు చూసిన శేఖర్ కమ్ముల హీరోయిన్ గా తన సినిమా లో పెట్టుకోవాలి అనుకున్నాడు. 2004 వ సంవత్సరంలో విడుదలైన ఆనంద్ చిత్రంలో కమలినీ ముఖర్జీ హీరోయిన్ ని నటింపజేశాడు శేఖర్ కమ్ముల. మంచి కాఫీలాంటి సినిమా అనే ఉపశీర్షికతో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా కమలినీ ముఖర్జీ కి బాగా పేరు వచ్చింది. తన అందచందాలకు అభినయానికి ఫిదా అయిపోయిన వారు చాలా మంది ఉన్నారు. 

 

 

2006వ సంవత్సరంలో గోదావరి సినిమాలో సీతామహాలక్ష్మి క్యారెక్టర్ లో తెలుగు అమ్మాయిల అద్భుతంగా కనిపించి వావ్ అనిపించింది. తనని అలాగా చూపించి తెలుగు ప్రేక్షకులను అలరించిన క్రెడిట్ అంతా శేఖర్కమ్ముల కే దక్కుతుంది. అందంగా లేనా అసలేం బాలేనా అనే పాట కమలినీ ముఖర్జీ కెరీర్లో మర్చిపోలేదని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: