ఒకప్పుడు టాలీవుడ్ లో దాసరి నారాయణరావు సినీ పెద్దగా వ్యవహరించారు... ఇండస్ట్రీలో ఏ చిన్న సమస్య వచ్చినా దాసరి వద్దకు వెళ్లేవారు. చెన్నై నుంచి హైదరాబాద్ కి  సినీ పరిశ్రమ షిఫ్ట్ అయిన తర్వాత నాగేశ్వరావు, రామానాయుడు, దాసరి నారాయణరావు, కృష్ణ ఇలాంటి పెద్దలు తెలుగు సినిమా పరిశ్రమ  అభివృద్ధి కోసం ఎంతో పాటు పడ్డారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇలాంటి పెద్ద తరహా మనిషి లేరన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ బాధ్యతలు మెగాస్టార్ చిరంజీవి తీసుకుంటే బాగుంటుందని టాలీవుడ్ వర్గం ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ఏ చిన్న సమస్య వచ్చినా తన భుజాన వేసుకుని ముందుకు సాగుతున్నారు.

 

 

దేశంలో కరోనా సమస్య  ఎంతగా నష్టాన్ని.. కష్టాన్ని తీసుకు వచ్చిందో తెలిసిందే.  ముఖ్యంగా ఇది సినీ పరిశ్రమకు తీరని నష్టాన్ని కలిగించింది. సినీ పరిశ్రమలో రోజు వారి కార్మికుల కష్టాల్ని తీర్చేందుకు  సి.సి.సి స్థాపించారు. దీనికి  పలువురు సినీ పెద్దల వద్ద విరాళాలు  ఇస్తూ వచ్చారు. ఈ విధంగా కష్టాల్లో ఉన్న కార్మికులను ఆదుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. అంతేకాదు  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి కష్టాల్లో ఉంది 14000 మంది కార్మికులు వారి బాధ్యతల గురించి ప్రభుత్వం ఆలోచించాలని ముఖ్యమంత్రికి విన్నవించారు. 

 

 

విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ సైతం జూన్ నుంచి షూటింగ్ మొదలు పెట్టుకోవచ్చని అన్నారు.  ఆ మధ్య ‘మా’ మూవీస్ లో జరిగిన గొడవలు సైతం మెగాస్టార్ చిరంజీవి  పెద్దన్నగా ఆ సమస్యలు పరిష్కారానికి కృషి చేశారు. ఒకప్పుడు దాసని నారాయణ రావు ఇంత గౌరవమైన పాత్ర పోషించారు.  ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అంతే బాధ్యతతో తన పాత్ర పోషిస్తున్నారు. అందరికీ పెద్దన్నయ్యగా ఉండాలని టాలీవుడ్ వర్గాలు మొత్తం భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: