టాలీవుడ్ లో జయప్రద ఏ స్థాయిలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. అగ్ర హీరోల సరస సూపర్ హిట్ సినిమాలు చేసిన ఆమె... పలు విజయవంతమైన దర్శకుల సినిమాల్లో కీలక పాత్రలు పోషించడమే కాకుండా ఆమె చేసిన సినిమాల్లో ఆమెకు దర్శక నిర్మాతలు ఇచ్చిన పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె సినిమాలు అనగానే చాలా మంది అప్పట్లో హాల్ కి పని మానుకుని మరీ వెళ్ళే వారు అనేది వాస్తవం. 

 

ఇక ఆమె ఎక్కువగా సినిమాలు చేసిన దర్శకుల్లో రాఘవేంద్ర రావు ఒకరు. దాదాపు పది సినిమాలకు పైగా ఆమె ఆయన దర్శకత్వంలో చేసింది. ప్రతీ సినిమా కూడా దాదాపుగా విజయం సాధించాయి ప్రతీ సినిమాలో కూడా ఆమె మంచి నటన తో ఆకట్టుకున్నారు. దాదాపుగా ఆమె ఆయన దర్శకత్వంలో చేసిన సినిమాలు అన్నీ కూడా రికార్డ్ సృష్టించాయి. శోభన్ బాబు అదే విధంగా ఎన్టీఆర్ అక్కినేని హీరోలుగా వచ్చిన సినిమాల్లో ఆమె కెలక పాత్రలు పోషించారు. ఆమె సినిమాలకు మంచి గుర్తింపు కూడా ఆయన దర్శకత్వంలోనే వచ్చింది అనేది వాస్తవం. 

 

ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉండి రాజకీయాల్లో ఉన్నారు. సమాజ్ వాదీ పార్టీ నుంచి బయటకు వచ్చారు ఆమె ఇక బిజెపిలో చేరే అవకాశం ఉందని అనుకున్నా ఆమె మాత్రం ఏ పార్టీలో ఇంకా చేరలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె మళ్ళీ సినిమాలు చేస్తే చూడాలని ఉందని చాలా మంది ప్రేక్షకులు ఆమె అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు సినిమాలు చేసే ఉద్దేశం లేదని పలువురు అంటున్నారు. మరి చేస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: