మన తెలుగులో కొన్ని సినిమాలు కొందరు హీరోయిన్ లు అలా నిలిచిపోయారు. టాలీవుడ్ లో రామ్ గోపాల్ వర్మ చేసిన సినిమాలు ఎక్కువగా హిట్ అవ్వకపోయినా సరే ఆ సినిమాలు మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి అనేది వాస్తవం. రామ్ గోపాల్ వర్మ పని చేసిన హీరోయిన్ లు మంచి గుర్తింపు తెచ్చుకోకపోయినా స్టార్ హీరోయిన్ లతో చేసిన సినిమాల్లో మాత్రం వారిని ఆయన చూపించిన విధానం మాత్రం ఎంతగానో ఆకట్టుకుంది అనే చెప్పవచ్చు. క్షణ క్షణం సినిమాలో శ్రీదేవి తో ఆయన పని చేసారు. 

 

ఆ సినిమాలో శ్రీదేవి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఆమెను ఆ విధంగా చూపించడం లో ఆయన తీసుకున్న శ్రద్ధ గాని ఆమె నటించిన విధానం గాని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది అనే చెప్పవచ్చు. ఆమె కొన్ని కొన్ని సన్నివేశాల్లో ఆయన చూపించిన విధానం చూసి విమర్శకులు కూడా ఫిదా అయిపోయారు అనే చెప్పవచ్చు. ఆ విధంగా వర్మ శ్రీదేవి ని చూపించారు. ఆమె తో ఆ సినిమాలో రోమాన్స్ కూడా చేయించారు. ఆమె నటన చూసి ఒక సందర్భంలో ఆమె కాళ్ళ మీద పడిపోయాడు వర్మ. 

 

ఈ విషయాన్ని శ్రీదేవి చనిపోయిన తర్వాత కూడా వర్మ మీడియా లో చెప్పారు. ఆమె అంటే ఆయనకు ఏ స్థాయిలో అభిమానం ఉంది అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెను ఆయన ఆరాధిస్తారు అనేది చాలా సందర్భాల్లో రుజువు అయింది కూడా. ఆమె తో కలిసి ఆయన ఎక్కువ సినిమాలు చేయకపోయినా చేసిన సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ విధంగా శ్రీదేవి వర్మ కాంబినేషన్ ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది అనే చెప్పవచ్చు. ఆమె జీవిత కథ ఆధారంగా సినిమా చేస్తా ఆని కూడా ఆయన ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: