టాలీవుడ్ లో అయినా బాలీవుడ్ లో అయినా సరే రామ్ గోపాల్ వర్మ సినిమాలకు మంచి గుర్తింపు ఉంటుంది. ఆయన హీరోయిన్ లను చూపించే విధానం ఆయన కథల ఎంపిక అన్నీ కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఆయన సినిమాలు చూసిన వారు సినిమా గురించి కనీసం పది రోజులు అయినా మాట్లాడుకునే వారు అప్పట్లో. ఇప్పుడు అంటే ఆయన సినిమాలు గాడి తప్పాయి గాని ఆయన అదే స్థాయిలో సినిమాలు చేసి ఉంటే మాత్రం ఆయన ఇండియా లో అగ్ర దర్శకుడి గా ఒక వెలుగు వెలిగే వారు. ఆయన సినిమాలు ఎన్నో మంచి మంచి హిట్స్ అయ్యాయి. 

 

కాని ఆయన తనకు వచ్చిన పేరు ని ఎక్కువ కాలం నిలబెట్టుకోలేదు అనేది వాస్తవం. అగ్ర దర్శకుడిగా ఉన్న సమయంలో ఆయన చేసిన కొన్ని సినిమాలు ఇమేజ్ ని డ్యామేజ్ చేసాయి. ఇక అది అలా ఉంటే ఆయన పని చేసిన హీరోయిన్ లలో ప్రత్యేకంగా చెప్పుకునే హీరోయిన్ ఊర్మిళ. ఆమె తో దాదాపు పది సినిమాలకు పైగా చేసారు వర్మ. వాటిల్లో సూపర్ హిట్స్ ఉన్నాయి. ఇండియా వైడ్ గా  సంచలనం సృష్టించిన సినిమాలు ఉన్నాయి. వర్మ సినిమాలు అనగానే ఒక ఊపు సినిమాలు  కూడా ఉన్నాయి అనేది వాస్తవం. 

 

ఆయన నేడు టాలీవుడ్ లో అయినా బాలీవుడ్ లో అయినా మరో భాషలో అయినా సరే ఇబ్బంది పడవచ్చు గాని ఆయన సినిమాలు మాత్రం ఎప్పటికి చెరగని ముద్ర వేసాయి. ఊర్మిళ ను ఆయన చూపించిన విధానం ఆమెలో ఉన్న నటిని బయటకు తీసిన విధానం ఇక ఆమె అందాల గురించి ఉండే పాటలు అన్నీ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి ప్రేక్షకులను అనే చెప్పవచ్చు. కాగా వర్మ ఇప్పుడు క్లైమాక్స్ సినిమాను విడుదల చేయడానికి సిద్దంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: