బాలీవుడ్ లో సాధారణంగా హీరోయిన్ లు నటనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఈ తరం అయినా కిందటి తరం అయినా సరే అందం కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో నటన కు కూడా అదే స్థాయిలో ప్రాధాన్యత ఉంటుంది. దర్శక నిర్మాతలు ఎక్కువగా హీరోయిన్ ల నటన మీదనే ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇక అగ్ర హీరోయిన్ అయినా చిన్న హీరోయిన్ అయినా సరే సినిమాలో నటన ఉండాలి అనేది వాస్తవం. ఏ సినిమా అయినా సరే ప్రేక్షకులు గుర్తించాలి అంటే నటన లేకపోతే కష్టం అనే భావన లో ఉంటారు. అందుకే చాలా వరకు నటనకు యెనలేని ప్రాధాన్యత ఉంటుంది. 

 

ఈ తరంలో ప్రత్యేకంగా చెప్పుకునే హీరోయిన్ దీపిక పదుకొనే. ఆమె నటన చూసిన ప్రేక్షకులు అయితే ఆమెను కొన్ని సినిమాల్లో శ్రీదేవి తో పోల్చారు అనేది వాస్తవం. ఆమె స్టార్ హీరోయిన్ గా ఉన్నా సరే నటనకు ఎక్కడా కూడా లోటు చేయకుండా ఆమె నటించారు. ఇక ఆది పక్కన పెడితే... ఆమె సంజయ్ లీలా బన్సాలి తో కలిసి మూడు సినిమాలు చేసారు. మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. మూడు సినిమాల్లో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. రాం లీల, బాజీ రావు మస్తాని, పద్మావతి వంటి సినిమాలు ఎంతగానో ఆమె నటనకు నిదర్శనంగా నిలిచాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

 

ఆ సినిమాల్లో బన్సాలి దీపిక ను చూపించిన విధానం చూసి ప్రేక్షకులు మురిసిపోయారు.  బాజీ రావు మస్తానిలో దివానీ మస్తాని పాట, పద్మావత్ లో తొలి పాట దీపిక అందాలు ఆమెను చూపించిన విధానం ఎంతగానో ప్రేక్షకులకు నచ్చింది. టాలీవుడ్ లో కూడా ఈ కాంబినేషన్ కి అభిమానులు ఉన్నారు అనేది వాస్తవం. ఆ విధంగా మెప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: